నెల్లూరు : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలు మారుబోయిన గిరీష్ అలియాస్ గిరి, పర్వతనేని మధుసూదన్‌లను నెల్లూరు వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అలాగే సదరు దొంగల వద్ద నుంచి కొనుగోలు చేసిన వ్యాపారి వినోద్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు.