ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నెల్లూరు : ఏటీఎం సెంటర్లలో దొంగతనాలు పెరిగిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి దాటిన తర్వాత ఏటీఎంలలో డబ్బును నింపరాదు అని తాజాగా కేంద్ర హోంశాఖ నిబంధనలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన మనీ లోడింగ్ సిబ్బందే చేతివాటం చూపించారు. ఏటీఎంలలో డబ్బులు లోడ్ చేసే క్రమంలో ఏకంగా 79 లక్షల రూపాయలు నొక్కేశారు. ఈ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. సూళ్లూరుపేట, నెల్లూరు పట్టణంలో నగదు లోడ్ చేసే ‘రైటర్స్’అనే సంస్థలో పనిచేస్తున్న జగదీష్, కోటి, మునుస్వామిలు ఈ చోరీకి పాల్పడ్డారనీ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment