ATM Cash Robbery
-
ఏటీఎం కేటుగాళ్లు.. అసలు సంగతి ఇది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌కు చెందిన సెక్యూర్ వాల్యూ సంస్థలో కస్టోడియన్‌గా పని చేసిన కృష్ణకు ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన రూ.1.3 కోట్లు కాజేయడానికి ఆ సంస్థలో ఉన్న లోపాలే కలిసి వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇతడితో పాటు మాజీ సహోద్యోగి రాజశేఖర్‌ను సైతం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. న్యాయస్థానం అనుమతితో ఇరువురినీ కస్టడీలోకి తీసుకున్న అధికారులు లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యవస్థాగత లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై ఆ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు. ► సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని చేపట్టింది. వరంగల్‌కు చెందిన రాపాక రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ సంస్థలో కస్టోడియన్‌గా పని చేశాడు. ఏటీఎం మెషిన్లలో పెట్టాల్సిన రూ.1.23 కోట్లు మరికొందరితో కలిసి కాజేసిన ఆరోపణలపై గతంలో అరెస్టు అయ్యాడు. ఉద్యోగం కూడా కోల్పోయాడు. ఇదే సంస్థలో కస్టోడియన్‌గా పని చేస్తున్న గండెల్లి కృష్ణకు ఓ రూట్ అప్పగించారు. ► సెక్యూర్ వాల్యూ సంస్థ ప్రతి నెలా కచ్చితంగా ఆడిటింగ్ నిర్వహించేది. అయితే ఆ రోజు ఏ ఏటీఎం కేంద్రానికి వెళ్లి ఆడిటింగ్ చేయనున్నారో ముందే సిబ్బందికి చెప్పేది. ఇలా విషయం తెలుసుకునే కృష్ణ మరో ఏటీఎం నుంచి డబ్బు తెచ్చి అందులో పెట్టేవాడు. మరోపక్క ఓ ఏటీఎం మిషన్‌ను తెరవడానికి రెండు పాస్వర్డ్స్ వినియోగించాల్సి ఉంటుంది. భద్రత నిబంధనల ప్రకారం ఒక్కో పాస్వర్డ్ ఒక్కో ఉద్యోగికి చెప్పి బాధ్యుడిని చేయాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం రెండింటినీ ఒకే కస్టోడియన్‌కు చెప్పేస్తోంది. ► ఒక్కో పాస్వర్డ్ వ్యాలిడిటీ గడువు గరిష్టంగా 24 గంటల మాత్రమే. ఆ మరుసటి రోజు ఏ ఏటీఎంలో డబ్బు నింపాలో దానివే చెప్పాలి. అయితే సెక్యూర్ సంస్థ మాత్రం ఆయా రూట్లలో ఉన్న అన్ని ఏటీఎంలవీ కస్టోడియన్లకు వాట్సాప్ ద్వారా పంపించేస్తోంది. వీటిని తమకు అనుకూలంగా మార్చుకున్న కృష్ణ సంస్థ నిర్వాహకులకు అనుమానం రాకుండా వ్యవహరించాడు. మూడు నెలల కాలంలో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.కోటి కాజేశాడు. ఏ ఒక్క ఏటీఎం నుంచీ మొత్తం డబ్బు కాజేయలేదు. ఒక్కో దాని నుంచి కొంత చొప్పున మాయం చేశాడు. ► ఫలానా రోజు ఏ ఏటీఎంలో ఆడిటింగ్ జరుగుతుందో తెలుస్తుండటంతో.. మరో దాంట్లో నుంచి అవసరమైన మొత్తం తెచ్చి అందులో నింపి తప్పించుకునేవాడు. ఈ వ్యవహారాల్లో తన మాజీ సహోద్యోగి రాజశేఖర్ సలహాలు తీసుకుంటూ కొంత మొత్తం చెల్లించాడు. ఓ దశలో తన వ్యవహారం బయటపడుతుందని భావించిన కృష్ణ ఆ విషయం రాజశేఖర్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి రూ.30 లక్షలు కాజేయాలని, ఆపై కృష్ణ పోలీసులకు లొంగిపోవాలని పథకం వేశారు. అనుకున్నట్లే కాజేసిన కృష్ణను తన వాహనంపై పికప్ చేసుకున్న రాజశేఖర్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన వాటా తాను తీసుకుని ఉడాయించాడు. స్వాహా చేసిన డబ్బును కృష్ణ తన చెందిన వాటితో పాటు తన భార్య బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేశాడు. ఆపై ఆన్లైన్ బెట్టింగ్‌లో దాదాపు 90 శాతం కోల్పోయాడు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
ఏటీఎంలలో చోరీ: ఫ్లాట్, బంగారం కొన్నారు..
పూణె : ఏటీఎంలను ట్యాంపరింగ్ చేసి వాటిలోని నగదును దొంగిలించారనే అభియోగంపై గత నెలలో పింప్రి చించ్వాడ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగిలించిన డబ్బులతో వారు ఎంహెచ్ఏడీఏలో ఫ్లాట్, బంగారం నగలు కొన్నట్లు తేలింది. అరెస్టు సమయంలో పోలీసులు వారి నుంచి రూ.66 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు ఏటిఎం తయారీ సంస్థలో పనిచేసిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ మనోజ్ సూర్యవంశీ(30), మరో మెకానికల్ ఇంజనీర్ భానుదాస్ కోల్టే ఇద్దరిపై గతంలో టెల్లర్ మిషన్లను పగులగొట్టి డబ్బు దొంగిలించిన కేసులున్నాయి. ఆ కేసుల్లో ఒక ఇంజినీర్‌తో సహా, వారి సహచరులు ఆరుగుర్ని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శంకర్ బాబర్, అతని టీం ఈ దాడులు చేసి వారి నుంచి మూడు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యవంశీ, కోల్టే ఇద్దరూ ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినవారు. వీరు తమ అనుచరులతో కలిసి 2017 డిసెంబర్ ఇప్పటి వరకు ఎనిమిది ఏటీఎంల నుంచి నగదు చోరీ చేశారు. చివరి సారిగా సెప్టెంబర్ 24న డిఘీలోని ఒక ఏటీఎంని దోచుకున్నారు. అరెస్టైన మిగతా ఆరుగురు నిందితులను కత్రాజ్కు చెందిన మహేష్ దేవ్నికర్(30), బారమతికి చెందిన సాగర్ తవారే(31), తుషార్ చంద్‌గుడే(25), పురందర్కు చెందిన శంకర్ గైక్వాడ్(31), చించ్వాడ్కు చెందిన ఆశిష్ భలేరావ్(22), లాతూర్ జిల్లాకు చెందిన నర్సింగ్ ధూమల్(22)గా గుర్తించారు. ఈ ముఠా గత మూడేళ్లలో పలు ఏటీఎంల నుంచి సుమారు రూ.94 లక్షలు దొంగిలించింది. ఈ ముఠా ప్రధాన సూత్రధారి సూర్యవంశీ చోరీ నగదులో నుంచి రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొన్నాడు. అతను ఆభరణాలను ఒక ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టాడని, ఆ సంస్థ నుంచి డిపాజిట్ రశీదులను స్వాధీనం చేసుకుని అతని నుంచి రూ.50 వేలు కూడా స్వాధీనం చేసుకున్నామని బాబర్ తెలిపారు. కోల్టే దొంగిలించిన డబ్బు నుంచి పింప్రి చించ్వాడ్లో రూ.12 లక్షల విలులైన ఫ్లాట్ కొన్నట్లు ఆయన తెలిపారు. ఫ్లాట్ కొన్న రశీదును కూడా స్వాధీనం చేసుకున్నామని, ధూమల్ నుంచి రూ.5.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని బాబర్ తెలిపారు. మిగిలిన అయిదుగురు నిందితులు వైద్య బిల్లులు, వివాహం, వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేశారని బాబర్ తెలిపారు. -
ఏటీఎం మిషన్లే వీరి టార్గెట్
సాక్షి, గజ్వేల్ : జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులువుగా డబ్బు సంపాదించాలని చోరీ బాట పట్టారు. పథకం ప్రకారం రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మూడోసారి ఎలాగైనా డబ్బు దొంగిలించాలని పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఓ ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. గజ్వేల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధి ప్రజ్ఞాపూర్ చౌరస్తా జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలుసుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ నారాయణ వెల్లడించారు. ప్రజ్ఞాపూర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చోరీ వివరాలు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని పిడిచెడ్ రోడ్డులో శుక్రవారం తెల్లవారు జామున ఐడీబీఐ ఏటీఎం వద్ద ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్న క్రైమ్ పార్టీ పోలీస్ కానిస్టేబుళ్లకు కనిపించారు. వారిని తనిఖీ చేయడంతో ఆటోలో గడ్డపార, సుత్తి, రాడ్, కటింగ్ ప్లయర్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్అండ్ఆర్ కాలనీలో నివాసముంటున్న బైలంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు బొమ్మ స్వామి, బొమ్మ ఐలేని అలియాస్ ఐలేష్ అన్నదమ్ములు. బొమ్మ స్వామి ఆటో(టీఎస్ 26టీ 2021)ను తన గ్రామం నుంచి గజ్వేల్‌కు నడుపుతుంటారు. వీరికి గజ్వేల్ పట్టణంలోని ఢిల్లీవాల హోటల్ సమీపంలో నివాసముండే పెయింటర్ రాయపోల్ మండలం మంతూర్ గ్రామానికి చెందిన తంగలపల్లి నవీన్ అలియాస్ నవీన్‌కుమార్, వడ్డేపల్లికి చెందిన అయ్యగల్ల నవీన్‌తో పరిచయం ఏర్పడింది. ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే పథకం పన్నారు. ఏటీఎంల్లో డబ్బులు ఉండి సెక్యూరిటీ ఉండని వాటిని చోరీ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 11న తుర్కపల్లి దగ్గరలోని మురహరిపల్లి ఏటీఎం వద్దకు స్వామి ఆటోలో ఐలేష్, తంగలపల్లి నవీన్, అయయగల్ల నవీన్, గంగొల్ల ప్రశాంత్ వెళ్లి సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ రెండోసారి జూన్ 22న రాత్రి సమయంలో గౌరారం బస్టాప్ సమీపంలో ఉన్న ఏటీఎం సీసీ కెమరాల వైర్లను తొలగించారు. మిషన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించి మరోసారి విఫలయ్యారు. రెండు సార్లు ప్రయత్నించి విఫలం కావడంతో జూన్ 26వ తేదీన స్వామి, ఐలేష్, తంగలపల్లి నవీన్, అయ్యగల్ల నవీన్ సమావేశమయ్యారు. మూడోసారి ఎలాగైనా చోరీ చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రజ్ఞాపూర్‌కు వచ్చి జగదేవ్‌పూర్ రోడ్డులో బెంగుళూరు కేంద్రంగా నడిచే ఇండియా వన్ ఏటీఎం సెంటర్ వద్ద రెక్కి నిర్వహించారు. అదే రోజు రాత్రి సీసీ కెమెరాలను తొలగించి వెళ్లారు. 27న ఆటోలో ఏటీఎం సెంటర్‌కు వచ్చి ఏటీఎం మిషన్‌ను రాడ్లతో పెకిలించారు. మిషన్‌ను ఆటోలో వేసుకొని రింగురోడ్డు మీదుగా గౌరారం మార్స్ కంపెనీ పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం మిషన్‌ను పగలగొట్టి అందులో ఉన్న రూ. 4,98,800 నగదును పంచుకున్నారు. అయితే బొమ్మ స్వామి 2015లో గజ్వేల్‌లో దొంగతనం చేసిన కేసులో, అతడి తమ్ముడు ఐలేష్ ములుగు అత్యాచారం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లారు. ఇక దొంగిలించిన డబ్బు పంచుకోగా అందులో రూ. 28 వేలు ఖర్చుచేశారు. వీరి నుంచి రూ.470 లక్షల నగదు, ఆటో, దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార, సుత్తి, రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసున్నారు. ఏటీఎం మిషన్ చోరీకి గురైనట్లు జూన్ 29న దుద్దెడకు చెందిన గున్నాల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు చేధించి దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన గజ్వేల్ సీఐ ఆంజనేయులు, అదనపు సీఐ మధుసూదన్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహారావు, టాస్క్‌ఫోర్స్ సీఐ ప్రసాద్, సీసీ కెమెరా టీం సభ్యులు పరంధాములు, ఏఎస్ఐ సంధాని, క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, పోలీస్ కానిస్టేబుళ్లు యాదగిరి, సుభాష్‌ను రివార్డుతో అభినందించినట్లు తెలిపారు. -
‘మనీ’వేదన!
పాలమూరు : బ్యాంక్ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవులు.. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడడంతో నిత్యం లావాదేవీలు నడిపించే వ్యాపారులు మొదలు సాధారణ ప్రజలు వరకు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన లావాదేవీలు నడిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, తదితర జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో శుక్రవారం తెరుచుకోకపోగా విషయం తెలియని సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత రెండు రోజుల సాధారణ సెలవులు రాగా.. సోమవారం ఒక రోజు మాత్రమే బ్యాంకులు తెరుచుకోనున్నా యి. మళ్లీ మంగళవారం క్రిస్మస్ సెలవు, ఆ మరుసటి రోజు బుధవారం మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీంతో సోమవారం తప్పించి వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడుతున్నట్లవుతోంది. నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారు. ప్రధానంగా వ్యాపారులకు బ్యాంకుల ద్వారా డబ్బు పంపడం, తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గా ల వారు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారుల కు ఒకే రకమైన సవరణ ఉండేది. 11వ వేతన సవరణలో అధికారుల పనితీరు ఆధారంగా వేతన సవరణ చేయాలన్న యాజమాన్యాలు నిర్ణయించి, అమలు చేస్తుండడాన్ని నిరసిస్తూ బ్యాంకు అధికారులు సమ్మెకు వెళ్తున్నారు. దీం తో పాటు చిన్న బ్యాంకుల విలీనాన్ని చేయ రాదని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో సాధారణ సెలవులు, క్రిస్మస్ సెలవు రావడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరుస సెలవులతో వెతలు బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె కారణం గా బ్యాంకుల సేవలు ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈనెల 21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేశారు. ఈనెల 22న నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు. 23న ఆదివారం సాధారణ సెలవు. 24వ తేదీ సోమవారం బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. ఇక ఈనెల 25న కిస్మస్ పండగ సెలవు. 26న బ్యాంకు ఉద్యోగుల సామూహిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఆ రోజు బ్యాంకులు పని చేయవు. మొత్తం మీద వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే బ్యాంకులు పని చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ఏర్పడే అవకాశం నెలకొంది. సాధారణ రోజుల్లోనే ఏటీఎంలో నగదు లేక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏటీఎంలలో గురువారం పెట్టిన నగదు శనివారం ఉదయం వరకు ఖాళీ అయ్యింది. దీంతో చాలా మంది ఏటీఎంల చుట్టూ డబ్బు కోసం తిరగడంకనిపించింది. ఈనెల 25న క్రిస్మస్ పండగ ఉండటంతో క్రిస్టియన్లు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాలి. కానీ పరిస్థితిని చూస్తే పండుగ జరుపుకునేందుకు నగదు ఎలా సమకూర్చుకోవాలని వారు ఆలోచనలో పడ్డారు. కాగా, ప్రైవేట్ బ్యాంకులైన యాక్సిస్, ఐసీఐసీఐతో పాటు సహకార బ్యాంకులు తప్ప మిగిలిన జాతీయ బ్యాంకులన్నీ మూతపడటంతో వారం రోజుల పాటు నగదు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. ఏటీఎంలన్నీ ఖాళీ జిల్లాలో ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా డబ్బు పెట్టకపోవడంతో జనం నిరాశగా వెళ్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోనే 30కుపైగా ఏటీఎంల్లో ఏ ఒక్కదాంట్లోనూ డబ్బు లేకపోవ డం గమనార్హం. ప్రధాన ఏటీఎంల్లో కొంత డ బ్బు పెడుతున్నా గంటలోపే అయిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బు ఉన్నట్లు తెలియగానే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఇందులో కొందరికే డబ్బు అందుతుండగా.. మిగతా వారే నిరాశతో వెనుతిరుగుతున్నారు. రూ.5వేల కోసం 10ఏటీఎంలు తిరిగాను నాకు ఈరోజు ఉదయం అత్యవసరంగా రూ.5వేలు కావాల్సి వచ్చింది. ఖాతాలో డబ్బు ఉందన్న ధైర్యంతో ఏటీఎంకు వెళ్తే ‘నో క్యాష్’ బోర్డు కనిపించింది. అలా పట్టణంలోని దాదాపు 10ఏటీఎంలు తిరిగినా అదే పరిస్థితి ఎదురైంది. మామూలు రోజుల్లో ఏటీఎంల్లో డబ్బు పెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువ డబ్బు ఉంచడమో లేదా ప్రతిరోజు రెండు పూజలా డబ్బు పెట్టడమో చేస్తే మాలాంటి వారికి ఇబ్బందులు తప్పుతాయి. – వినోద్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ -
నగదు లోడ్ చేసే సిబ్బందే ఏటీఎం లూటీ..!
సాక్షి, నెల్లూరు : ఏటీఎం సెంటర్లలో దొంగతనాలు పెరిగిపోతుండడంతో పట్టణ ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి దాటిన తర్వాత ఏటీఎంలలో డబ్బును నింపరాదు అని తాజాగా కేంద్ర హోంశాఖ నిబంధనలు జారీ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలవుతాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండాల్సిన మనీ లోడింగ్ సిబ్బందే చేతివాటం చూపించారు. ఏటీఎంలలో డబ్బులు లోడ్ చేసే క్రమంలో ఏకంగా 79 లక్షల రూపాయలు నొక్కేశారు. ఈ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. సూళ్లూరుపేట, నెల్లూరు పట్టణంలో నగదు లోడ్ చేసే ‘రైటర్స్’అనే సంస్థలో పనిచేస్తున్న జగదీష్, కోటి, మునుస్వామిలు ఈ చోరీకి పాల్పడ్డారనీ, నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
దొంగలను పట్టించిన సీసీ కెమెరా
వర్గల్(గజ్వేల్) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ. 22 లక్షలను పక్కా స్కెచ్ ప్రకారం కొట్టేసిన నిందితులను సీసీ కెమెరా ఫుటేజీలు పట్టించాయి. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ మంగళవారం ఏసీపీ మహేందర్‌తో కలిసి గౌరారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన అరుణోజి నవీన్(24) రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. మరో కస్టోడియన్ ప్రవీణ్‌తో కలిసి వివిధ ఏటీఎమ్‌లలో డబ్బులు పెట్టి వస్తాడు. వర్గల్ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు వెళ్తుండగా వాటిని కాజేయాలని తన మిత్రుడు ప్రజ్ఞాపూర్‌కు చెందిన మెతుకు ప్రసాద్ కుమార్ (23)తో కలిసి స్కెచ్ వేశాడు. పథకంలో భాగంగా శనివారం నవీన్ సెలవు పెట్టాడు. వర్గల్ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు శనివారం మధ్యాహ్నం రూ. 22 లక్షల నగదు బ్యాగుతో ఇద్దరు కస్టోడియన్లు ప్రవీణ్ కుమార్, మామిడిపల్లి హరికృష్ణ గజ్వేల్ నుంచి బయల్దేరారు. వీరిని బైక్ మీద అనుసరిస్తున్న ప్రసాద్ కుమార్ మక్త సమీపంలో డబ్బుల బ్యాగును లాక్కొని పారిపోయాడు. ప్రత్యేక బృందం ఏర్పాటు.. సీపీ ఆదేశాల ప్రకారం అదనపు డిప్యూటీ సీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వీరు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. కస్టోడియన్ నవీన్ సెలవు పెట్టాడని తెలసుకుని మంగళవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మిత్రుడు ప్రసాద్‌కుమార్‌తో కలిసి డబ్బును కాజేసినట్లు అతను వెల్లడించాడు. దొంగిలించిన నగదును శ్రీగిరిపల్లి గుట్ట ప్రాంతంలో దాచినట్లు చెప్పాడు. ప్రసాద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. గౌరారం రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, పీసీలు రామచంద్రారెడ్డి, రాజు, ఉపేందర్‌లకు రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. -
ఏటీఎం చోరీ కేసు నిందితుల అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: పులివెందుల ఏటీఎం చోరీ కేసు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఏటీఎంలలో నగదు నింపే సిబ్బందే ఈ దొంగతనానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి వెల్లడించారు. పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద పోలీసుల తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిలో ఏటీఎంలో దోపిడికి పాల్పడిన ఆరుగురు నిందితులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 53 లక్షల నగదుతో పాటు మూడు బైక్‌లు, ఓ ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు.