ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు | Car Accident In Nellore MGB Mall | Sakshi
Sakshi News home page

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు

Published Mon, Sep 10 2018 11:00 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Car Accident In Nellore MGB Mall - Sakshi

చికిత్స పొందుతున్న చిన్నారి

నెల్లూరు(మినీబైపాస్‌) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడిన ఘటన ఎంజీబీ మాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బారకాస్‌ సెంటర్‌లో నివాసం ఉంటున్న రక్షిత్‌ తన కుమార్తెలు డోయల్‌(4), రేవా(3)తో ఎంజీబీ మాల్‌కు వచ్చారు. ఈ క్రమంలో మెయిన్‌ గేట్‌కు చేరుకునేసరికి వెనుక నుంచి తమిళనాడు రిజిస్ట్రేషన్‌ గల స్విఫ్ట్‌ కారు మితిమీరిన వేగంతో వస్తూ ఢీకొంది.

దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కారు వేగానికి నిలిపి ఉన్న పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. కారులో ఐదుగురు ఉన్నారని, డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి పరారయ్యాడని, అతను మద్యం సేవించి ఉన్నాడని బాలికల తండ్రి తెలిపాడు. కాగా మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుండగా, కారులోని ఓ మహిళ దుర్భషలాడి దాడికి యత్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాదానికి కారణమైన కారు, పార్కింగ్‌లో దెబ్బతిన్న వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement