
ప్రొద్దుటూరు కమిషనర్ బదిలీ
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను ప్రకాశం జిల్లా ఒంగోలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను ప్రకాశం జిల్లా ఒంగోలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 30వ తేదీన నరసరావుపేట మున్సిపాలిటీ నుంచి బదిలీపై ప్రొద్దుటూరుకు వెంకటకృష్ణ కమిషనర్‌గా వచ్చారు. ప్రస్తుతం ప్రొద్దుటూరుకు కృష్ణాజిల్లా గుడివాడ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అలాగే పులివెందుల కమిషనర్ రంగారావును గుంటూరు జిల్లా మంగళగిరికి, మంగళగిరి కమిషనర్ ఎన్.నాగేశ్వరరావు పులివెందులకు, జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజును చిత్తూరు జిల్లా మదనపల్లికి, నంద్యాల ఆర్‌ఓ నహీం అహ్మద్‌ను జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
మున్సిపల్ ఉద్యోగుల బదిలీ
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళుతున్నారు. మున్సిపల్ చైర్మన్ సీసీ అశ్వర్థనారాయణను ధర్మవరం మున్సిపాలిటీకి, ఆర్‌ఐలు సబ్దార్‌ను ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి, షఫిని జమ్మలమడుగు మున్సిపాలిటీకి, ఈ2 భక్తుడును మైదుకూరు మున్సిపాలిటీకి, టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లోని షప్తుల్లాను పులివెందుల మున్సిపాలిటీకి బదిలీ చేశారు.