
'మీ బిడ్డను ఆశీర్వదించండి'
ఓ వైపు 41 డిగ్రీల ఎండ. మాడు చుర్రుమంటోది అయినా...తమ అభిమాన నేతను చూడటానికి జనం దండులా కదిలారు.
ప్రొద్దుటూరు : ఓ వైపు 41 డిగ్రీల ఎండ. మాడు చుర్రుమంటోది అయినా...తమ అభిమాన నేతను చూడటానికి జనం దండులా కదిలారు. ఎన్నికల ప్రచారంలో భాగం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడిని చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా కదం తొక్కారు. మీ బిడ్డను వచ్చాను ఎన్నికల్లో ఆశీర్వదించాలని జగన్ ప్రజలను కోరారు.
ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. అభివృద్ధి చేసే వారినే నాయకుడిగా ఎన్నుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ప్రజల ఆదర, అభిమానాలతోనే ఎంపీగా అయిదు లక్షల మెజార్టీతో గెలిచానన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని, యువనేతగా జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తాడని అన్నారు.
చిన్నతనం నుంచి తనను ఆదరిస్తున్నారని... ఇప్పుడు కూడా అవినాష్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జగన్ వాహనం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నేడు మైదుకూరు, ఖాజీపేట్, కమలాపురం, కడప బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించనున్నారు.