ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం! | tdp leaders rowdism in prudduturu | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటురులో పేట్రేగిన ‘పచ్చ’ రౌడీయిజం!

Published Sun, Apr 16 2017 1:42 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

tdp leaders rowdism in prudduturu

  • మరోసారి ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా
  • తీవ్ర నిరసన తెలిపిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు
  • వైఎస్‌ఆర్‌ జిల్లా: అధికార టీడీపీ నేతలు తీవ్ర దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వరుసగా రెండోరోజూ వాయిదా పడింది. మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని చేజిక్కించుకునేందుకు కావాల్సిన బలం తమకు లేకపోవడంతో అధికార టీడీపీ మరోసారి హైడ్రామాకు తెరతీసింది. చైర్మన్‌ పదవిని సొంతం చేసుకునేందుకు కావాల్సినంత కౌన్సిలర్ల బలమున్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకోవడానికి రౌడీయిజానికి, దౌర్జన్యానికి దిగింది. ఎన్నికను అడ్డుకోవడమే లక్ష్యంగా వరుసగా రెండోరోజు ఆదివారం కూడా టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసాలకు దిగారు. కౌన్సిలర్లకు మద్దతుగా ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులతో టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. వారి ఒత్తిళ్లకు, రౌడీయిజానికి తలొగ్గిన అధికారులు మరోసారి ఎన్నికను వాయిదా వేశారు. పట్టపగలు పచ్చనేతల రౌడీయిజానికి తలొగ్గి అధికారులు ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.

    ఈ దారుణంపై ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నిక జరపాల్సిందేనంటూ కౌన్సిల్‌ హాల్‌లో అధికారులకు అడ్డంగా  పడుకొని నిరసన తెలిపారు. ప్రసాద్‌రెడ్డిని పక్కకు తోసేసి మరీ అధికారులను పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు, టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement