దారి చూపు దీపాలు...
పెద్దవారి మాటలు అనుభవాల మూటలు. వెలుగు దీపాలు. యువత సరియైన దారిలో నడవాలంటే, ఒక ఆశయం అంటూ ఏర్పరచుకోవాలంటే, దాన్ని సాధించాలంటే, విజయ ధ్వజాన్ని సగర్వంగా పదిమందిలో ఎగరేయాలంటే ఆ వెలుగు కళ్లలో పడాలి. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్దలు, పేరు బయటపడడానికి ఇష్టపడని అజ్ఞాత జ్ఞానులు తమ మాటల్లో ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆ మాటల వెలుగులు ఇవి....
ఒక యువకుడు తన సాయంత్రాలను ఏ విధంగా గడుపుతున్నాడో చెబితే... అతడు ప్రపంచం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపగలడో చెప్పవచ్చు. తమ ఖాళీ సమయాన్ని హానిరహిత ఆలోచనలతో, సృజనాత్మక, బాధ్యతాయుతమైన విషయాలకు సంబంధించిన చర్చలతో గడిపేవారు గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధులైనవారని చెప్పవచ్చు.
- బి.సి.ఫోర్బ్స్, స్కాటిష్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్, ఫోర్బ్స్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడు
ఒక దేశం, ఆ క్షణంలో నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడం అనేది ఆ దేశంలో ఉండే యువత మీద ఆధారపడి ఉంటుంది.
- జాన్ పి.గ్రియర్, జర్నలిస్ట్, ఫోర్బ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
యవ్వనమనేది వసంతకాలంలాంటిది. ఆ సమయంలో నన్ను మనిషిగా నిలబెట్టే సుసంపన్నమైన విత్తనాలు నాటాను. మనిషిగా నేను ఎదిగే క్రమంలో అవి వృక్షాలుగా మారి, వయసులోకి వచ్చేసరికి చక్కని ఫలాలు ఇచ్చాయి.
-రిచర్డ్ హిల్ ఫౌస్
యవ్వనంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. యవ్వనం అంటేనే పోరాడే వయసు అని అర్థం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే తెలివితేటలతో కూడిన శక్తి ఆ వయసులో వస్తుంది.
- అజ్ఞాత రచయిత
విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. విలువలతో కూడా కూడిన విజయాన్ని సాధించిన వ్యక్తిగా నిలబడేందుకు ప్రయత్నించు.
-అల్బర్ట్ ఐన్‌స్టిన్, శాస్త్రవేత్త
నువ్వు చేసే పనులు అవతలి వారిలో స్ఫూర్తిని కలిగించి, ఉత్సాహాన్ని నింపి, నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాయంటే... నువ్వే ఒక లీడర్.
- అజ్ఞాత రచయిత
ఈ ప్రపంచం శక్తియుక్తులు కలిగిన వారి సొంతం.
-రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, అమెరికన్ రచయిత
ఒక అవసరాన్ని గుర్తించు, దాన్ని తీర్చడానికి ప్రయత్నించు.
-మిసెస్ రూత్ స్టాఫోర్డ్ పీలే, అమెరికన్ రచయిత్రి
చతురత, తెలివిగలవానిగా ఎదగడంలో ఒక శాతం స్ఫూర్తి ఉంటే 99 శాతం కష్టం ఉంటుంది.
-థామస్ ఎడిసన్, శాస్త్రవేత్త
భరించలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని ఎదురించి పోరాడు.
పోరాడలేకపోతున్నాను అనుకుంటే.. దాన్ని భరించి బతుకు.
- అజ్ఞాత రచయిత
నిన్న చేసిన పని ఈ రోజుకూ నీకు అనందాన్ని ఇస్తుంటే.. ఈ రోజు అంతకన్నా గొప్పగా ఏమీ చేయలేవు.
- అజ్ఞాత రచయిత
నువ్వు ఏం ఆలోచిస్తున్నావనే విషయాన్ని ఎదుటివారి అంచనాలకు అందనివ్వకు.
- అజ్ఞాత రచయిత