మాట్లాడుతున్న బీఎల్ దీక్షితులు
పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలి
Published Sat, Jul 30 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
♦ ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు
ఎచ్చెర్ల: ఇంజినీరింగ్ కళాశాలల్లో పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యమివ్వాలని ఏపీ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ డాక్టర్ బీఎల్ దీక్షితులు పిలుపునిచ్చారు. చిలకపాలేం సమీపంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా ‘రీసెంట్ ట్రెండ్స్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇమేజ్ ప్రొసెసింగ్’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. కార్యక్రమానికి దీక్షితులు రీసోర్సు పర్సన్‌గా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఇమేజ్ ప్రోసెసిగ్ సాంకేతి పరిజ్ఞానం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కొత్త ఆవిష్కరణలతో వైద్య, వాతావరణ, రవాణా వంటి రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆర్థోపెడిక్ విభాగంలో చిన్నలోపంలో ఉన్నా గుర్తించే అధునాతన ఎక్స్‌రే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. రోబోటిక్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, న్యూరో సైన్స్, క్లోడ్ కంప్యూటరింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రైల్వే, బ్యాంకింగ్, మెడిసిన్... ఇలా అన్ని రంగాలు ఇమేజ్ ప్రొసెసింగ్ రంగంపై ఆధారపడుతున్నాయని వివరించారు. వైద్య శాస్త్రంలో ముందుగా జబ్బు గుర్తిస్తేనే అందుకు తగ్గ చికిత్స ప్రారంభించగలమన్నారు. ప్రస్తుత విద్యావిధానంలో సైతం మార్పులు అవసరంగా చెప్పారు. విద్యార్థులు తరగతి గదికి పరిమితం కావటం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. నిరంతర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై విశ్లేషనాత్మక సదస్సులు అవసరంగా చెప్పారు. సదస్సు అనంతరం దీక్షితులను కళాశాల మేనేజ్ మెంట్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జి.రమేష్‌బాబు, ప్లేస్ మెంట్ అధికారి డాక్టర్ గణియా రాజేంద్రకుమార్, సీఎస్‌ఈ ప్రొఫెసర్లు డాక్టర్ టి.వి.మధు సూధనరావు, టంకాల మాణిక్యాలరావులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement