2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! | Here's The List Of Industrialists Who Received Padma Award 2024, Details Inside - Sakshi
Sakshi News home page

Padma Awards 2024: పారిశ్రామిక పద్మాలు - సీతారాం జిందాల్ నుంచి శశి సోనీ వరకు..

Published Fri, Jan 26 2024 9:29 AM | Last Updated on Fri, Jan 26 2024 1:13 PM

Industrialists Padma Award 2024 Winners - Sakshi

కేంద్రం ప్రకటించిన 132 పద్మ అవార్డులలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు / NRI / PIO / OCI వర్గానికి చెందిన వారు, 9 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఇందులో వాణిజ్య, పారిశ్రామిక విభాగం నుంచి ఇద్దరికి పద్మ భూషణ్, మరో ఇద్దరికీ పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

పద్మ భూషణ్

  • సీతారాం జిందాల్ - కర్ణాటకకు చెందిన జిందాల్ అల్యూమినియం లిమిటెడ్, సీతారాం జిందాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీతారాం జిందాల్ (SITARAM JINDAL)కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ లభించింది.
  • యంగ్‌ లియు - ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ ఫాక్స్‌కాన్ సీఈఓ యంగ్‌ లియుకు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మ భూషణ్ దక్కింది. భారతదేశంలో పారిశ్రామిక రంగంలో లియు చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుని అందించింది. భారతదేశంలో విస్తృతంగా సేవలందిస్తూ.. ఇప్పటికి సుమారు 40000 మందికి ఉద్యోగాలు కల్పించింది.

ఇదీ చదవండి: తైవాన్ వ్యక్తికి పద్మభూషణ్ - ఎవరీ యంగ్ లియు!

పద్మశ్రీ

  • కల్పన మోర్పారియా - మహారాష్ట్రకు చెందిన జేపీ మోర్గాన్ ఇండియా సీఈఓ 'కల్పన మోర్పారియా'కు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ లభించింది.
  • శశి సోనీ - కర్ణాటకకు చెందిన శశి సోనీకి కూడా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ కైవసం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement