భారతీయ రచయిత దినేష్ డిసౌజ్ కు ఊరట!
భారతీయ రచయిత దినేష్ డిసౌజ్ కు ఊరట!
Published Wed, Sep 24 2014 10:47 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
న్యూయార్క్: ఫెడరల్ క్యాంపెన్ ఫైనాన్స్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల కేసులో భారత సంతతికి చెందిన రచయిత, కామెంటేటర్ దినేష్ డి సౌజాకు ఊరట లభించింది. 2012లో నిర్వహించిన చట్టవ్యతిరేక కాంపెన్ సేవల ద్వారా 20 వేల డాలర్లు కూడగట్టుకునారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసును మాన్ హట్టన్ కోర్టు విచారించి గతంలో 16 నెల జైలుశిక్ష విధించారు. అయితే తాజాగా జైలుశిక్షకు బదులుగా 30 వేల డాలర్ల జరిమానా, ఐదు సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని విధించారు.
ప్రోబేషన్ కాలంలో కమ్యూనిటి కన్ ఫైన్ మెంట్ సెంటర్ లో వారంలో ప్రతిరోజు ఎనిమిది గంటలపాటు శిక్షణ తరగతుల్ని నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ 2012లో 2016: 'ఒబామాస్ అమెరికా' ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. 'ది రూట్స్ ఆఫ్ ఒబామాస్ రేజ్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. గత మే నెలలో తనకు విధించిన శిక్షను ఓ పిచ్చి ఐడియా. తప్పుడు నిర్ణయం. తెలివితక్కువ పని అని దినేష్ వ్యాఖ్యలు చేశారు.
Advertisement