బిల్డింగ్‌ను సగానికి వంచేద్దాం!
న్యూయార్క్: మరో గొప్ప ఆకాశహర్మ్యానికి న్యూయార్క్ వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే పొడవైన బిల్డింగ్ నిర్మించేందుకు అక్కడి ఆర్కిటెక్చర్ సంస్థ ఒయివో స్టూడియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచంలో ఎత్తయిన భవంతులకు పెట్టింది పేరైన మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
మిగతా ఆకాశహర్మ్యాలలా కూకుండా తిరగేసిన 'U' ఆకారంలో చేపట్టనుండటం దీని ప్రత్యేకత. పూర్తయితే.. 4000 అడుగుల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్‌గా ఇది రికార్డులకెక్కనుంది. న్యూయార్క్ జోన్‌లో ఎత్తైన భవంతులపై ఉన్న పరిమితులను బెండ్(మార్చడానికి) చేయడానికి బదులు బిల్డింగ్‌నే బెండ్ చేయడం వల్ల ప్రతిష్టాత్మకమైన నిర్మాణాన్ని రూపొందించొచ్చని ఒయివో బిల్డింగ్ ప్రపోజల్‌లో పేర్కొంది. ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ ఇయోన్నిస్ ఒయాన్మవ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం పెట్టుబడులు సమీకరించే పనిలో ఉన్నారు.