చైనా సంస్థ చేతికి న్యూయార్క్ వాల్‌డార్ఫ్ ఆస్టోరియా హోటల్ | Waldorf-Astoria Hotel to Be Sold for $1.95 Billion | Sakshi
Sakshi News home page

చైనా సంస్థ చేతికి న్యూయార్క్ వాల్‌డార్ఫ్ ఆస్టోరియా హోటల్

Published Tue, Oct 7 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

చైనా సంస్థ చేతికి న్యూయార్క్ వాల్‌డార్ఫ్ ఆస్టోరియా హోటల్

చైనా సంస్థ చేతికి న్యూయార్క్ వాల్‌డార్ఫ్ ఆస్టోరియా హోటల్

న్యూయార్క్: న్యూయార్క్‌లోని మన్‌హటన్‌లో ఉన్న  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  హోటల్ వాల్‌డార్ఫ్ ఆస్టోరియా చేతులు మారనున్నది. ఈ హోటల్‌ను చైనాకు చెందిన బీమా కంపెనీ అన్‌బాంగ్ ఇన్సూరెన్స్ గ్రూప్ 195 కోట్ల డాలర్లకు హిల్టన్ వరల్డ్‌వైడ్ నుంచి కొనుగోలు చేయనున్నది.

ఈ కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలను రానున్న వందేళ్ల పాటు హిల్టన్ వరల్డ్‌వైడ్ చూస్తుంది. ఈ హోటల్‌లో పీకాక్ అల్లే, బుల్ అండ్ బేర్, ప్రైమ్ స్టీక్‌హౌస్, ఆస్కార్స్ వంటి రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ హోటల్‌ను భారీగా పునర్నిర్మాణం చేయనున్నామని ఇరు కంపెనీలు వెల్లడించాయి. ఈ హోటల్ విక్రయం ద్వారా వచ్చిన నిధులతో మరిన్ని హోటళ్లను కొనుగోలు చేయాలని హిల్టన్ వరల్డ్‌వైడ్ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement