20 ఏళ్ల తర్వాత ఆయనతో కేట్ వస్తోంది | Kate Winslet to star in Woody Allen's next project | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తర్వాత ఆయనతో కేట్ వస్తోంది

Published Wed, Jun 22 2016 1:43 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

20 ఏళ్ల తర్వాత ఆయనతో కేట్ వస్తోంది - Sakshi

20 ఏళ్ల తర్వాత ఆయనతో కేట్ వస్తోంది

లాస్ ఎంజెల్స్: హాలీవుడ్ ప్రముఖ నటి కేట్ విన్స్లెట్ తదుపరి సినిమా ఖరారైంది. ఆమె ప్రముఖ నటుడు, దర్శకుడు ఊడీ అలెన్(80) చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. అయిత, కథ, దర్శకత్వం, నిర్మాత ఊడీనే కావడం ఈ చిత్ర విశేషం. తన ఇరవయేళ్ల నట ప్రస్తానంలో ఒక్కసారి కూడా వూడీ తీసిన చిత్రాల్లోగానీ, ఆయన నటించిన సినిమాల్లోగానీ కనిపించలేదు కేట్.

దీంతో ఈ సినిమాకు ఆమె చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటించేందుకు కావాల్సిన చర్చలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇంతకీ కథ ఏమిటన్న విషయంపై మాత్రం గోప్యం వహిస్తున్నారు. గతంలో నటించాలని భావించినా తనకు ఆ అవకాశం రాలేదని, తాజాగా అది రావడంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని కేట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తోందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement