రెబెక్కా హాల్
‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ అనే సినిమాలో రెబెక్కా హాల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఉడీ అలెన్ ఈ సినిమాకు దర్శకుడు. సెప్టెంబర్‌లో మొదలైన ఈ సినిమా షూట్ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ టైమ్‌లో ‘‘ఈ సినిమాకు పనిచేసినందుకు సిగ్గుపడుతున్నా. ఈ సినిమాకు నాకొచ్చిన రెమ్యునరేషన్‌లో ఒక్క డాలర్ కూడా నేను ఉంచుకోను’’ అని చెప్పేసి ౖ‘టెమ్ ఈజ్ అప్’ అనే సంస్థకు ఆ డబ్బు డొనేట్ చేసింది రెబెక్కా. రెబెక్కా మాత్రమే కాదు, ఈ సినిమాకు పనిచేసిన స్టార్స్ అంతా జీవితంలో మళ్లీ ఉడీ అలెన్‌తో పనిచేయమని చెప్పేసి తమ రెమ్యునరేషన్‌ను టైమ్ ఈజ్ అప్ అనే సంస్థకు డొనేట్ చేశారు.
అన్నీ బాగుంటే ‘ఎ రెయినీ డే ఇన్ న్యూయార్క్’ 2018లో వచ్చే క్రేజీ సినిమాల్లో ఒకటి కావాలి. కానీ అలా కావడం లేదు. కారణం ఉడీ అలెన్. నిజానికి ఉడీ అలెన్ సినిమాలంటే ఆయన వల్లే క్రేజ్ తెచ్చుకుంటాయి. అలాంటిది ఇప్పుడు ఆయన పేరే ఇందుకు నెగటివ్‌గా మారింది. కారణం అలెన్ కూతురే ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పడం. ఇప్పుడీ ఆరోపణల వల్లే గ్రేటెస్ట్ ఫిల్మ్‌మేకర్స్‌లో ఒకరనిపించుకున్న అలెన్ ఒక్కసారే ఇలాంటి స్థాయికి వచ్చి పడిపోయాడు. ఇదే సినిమాకు పనిచేసిన తిమోతి, సెలెనా గొమేజ్ కూడా అలెన్‌తో మళ్లీ పనిచేయమని చెప్పేశారు. మొత్తం మీద ఇప్పుడు ఈ సినిమా విడుదల వరకూ వెళుతుందా? అన్న ప్రశ్న కూడా వినబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment