అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. గురువారం సాయంత్రం గుర్తు తెలియని దుండగులు టీడీపీ కౌన్సిలర్ సాధిక్ ను వేటకొడవళ్లతో నరికారు.
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాధిక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. సాధిక్ హత్య నేపథ్యంలో తాడిపత్రిలో బందోబస్తును పెంచారు.
టీడీపీ కౌన్సిలర్ దారుణ హత్య
Published Thu, Oct 23 2014 8:04 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM
Advertisement
Advertisement