సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఒక ఎద్దు విలువ రూ.కోటి, మేక విలువ రూ.7 లక్షలు. బెంగళూరు జీకేవీకే అవరణలో శుక్రవారం ప్రారంభమైన వ్యవసాయ మేళాలో వీటిని రైతులు ప్రదర్శనకు ఉంచారు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన రైతు బోరేగౌడ వ్యవసాయ ప్రదర్శనకు తను పోషిస్తున్న ఈ ఎద్దును ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీని వయస్సు మూడున్నర సంవత్సరాలు. దీని వీర్యాన్ని వారానికి ఒక రోజు సేకరిస్తారు.
ఒక డోస్‌ను రూ.వెయ్యితో విక్రయిస్తున్నట్లు రైతు తెలిపారు. ఇక దక్షిణ ఆఫ్రికాలోని బోయర్ జాతికి చెందిన మేకపోతును తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లికి చెందిన జితిన్ ఆగ్రో ఫారం యజమాని వెంకటేశ్ ప్రదర్శనలో ఉంచారు. పూణె నుంచి తెప్పించిన ఈ మేకపోతు 70 కేజీల బరువు ఉంది. 135–140 కేజీల వరకు వృద్ధి చెందుతుంది. ఈ మేకపోతును సంతానోత్సత్తికి ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment