సాక్షి,నల్గొండ: ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా నంబర్ ప్లేట్‌లోని టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి వాహనంగా గుర్తించారు.
కారులో దొరికిన నగదు బీజేపీ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. కరీంనగర్ 13 డివిజన్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు..డబ్బును విజయవాడ నుంచి మునుగోడుకి తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన డబ్బుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
చదవండి: మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు
Comments
Please login to add a commentAdd a comment