సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు ఈ యేడు ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చాయి. తొలివిడతగా రూ.140.80 కోట్ల విలువైన 4.40 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సోమవారం టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించారు. ఈమేరకు సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీలు(మ్యాక్స్), చిన్న తరహా యూనిట్ల(ఎస్‌ఎస్‌ఐ) యజమానులకు ఆర్డర్లు సిద్ధమయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగకు చీర, జాకెట్(పీస్)లను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది.
చీరకు బ్లాక్ రోటోవార్ప్‌తో డిజైన్ చేయగా.. జాకెట్‌ను మాత్రం వేరుగా డిజైన్ చేశారు. గతంలో మీటరు బతుకమ్మ చీరల బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 ఇవ్వాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. బ్లాక్ రోటోవార్ప్‌తో 2020 నాటి డిజైన్‌ను ఈ ఏడాది మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా ప్రతీ మీటరుకు ఒక్క రూపాయి ధర తగ్గించారు.
చీరల్లో 240 రకాల డిజైన్లను రూపొందించి అందులోనే మార్పులు చేశారు. కాగా, బతుకమ్మ చీరల బట్ట ధరను ఒక్క రూపాయి తగ్గించడంపై నేతన్నల్లో నిరాశ నెలకొంది. గతేడాది మీటరు బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment