ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మపై వివక్ష: స్వామిగౌడ్
ఉమ్మడి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వివక్షకు గురైందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా ఉద్యోగుల బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలాంటి ఉద్యోగులను తరిమికొడతామని, తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సొంత పదవిని కూడా కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తమను విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.