కవితను తప్ప మరెవరినీ పిలవరా?
బతుకమ్మ ఉత్సవానికి ఒక్క కేసీఆర్ కూతురు కవితకు తప్ప మరెవరికీ ఆహ్వానాలు ఉండవా అని హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మండిపడ్డారు. బతుకమ్మ సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా నిర్వహిస్తామని చెబుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలకు జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు ఎవరికీ ఇంతవరకు ఆహ్వానాలు అందలేదని ఆమె తెలిపారు. అసలు బతుకమ్మ ఉత్సవాలకు కేటాయించిన పది కోట్ల రూపాయలను ఎలా ఖర్చుచేస్తున్నారో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు చెప్పాలని కార్తీకరెడ్డి డిమాండ్ చేశారు.