బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం | Telangana Government alloted 10 Crores for Batukamma Festival | Sakshi
Sakshi News home page

బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

Published Fri, Sep 12 2014 5:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం - Sakshi

బతుకమ్మకు 10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. బతుకమ్మ పండగ నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నిజమాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 
తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 24నుంచి అక్టోబర్ 2వరకు బతుకమ్మ పండగ జరుగనుంది. బతుకమ్మ పండగ ఉత్సవాలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని ఆధికారులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement