సాక్షి, న్యూఢిల్లీ: ఎడతెరిపిలేకుండా సాగిన నినాదాల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. దీంతో కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ మరోమారు నోటీసులు ఇవ్వనుంది. సోమవారం సభ ప్రారంభమైన మరుక్షణమే టీఆర్‌ఎస్, ఏఐడీఎంకేలు తమ తమ డిమాండ్లతో హోరెత్తించాయి. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు సభను వాయిదావేశారు. తిరిగి 12 గంటలకు సమావేశాలు పునఃప్రారంభమైనా.. నినాదాల జోరు తగ్గలేదు. స్పీకర్ పలుమార్లు అభ్యర్థించినా సభ్యులు శాంతించలేదు.
అవిశ్వాసంపై స్పీకర్ ప్రకటన : నినాదాల మధ్యలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్సార్‌సీపీ, టీడీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తెవాల్సిఉంది. కానీ అంతకంటే ముందు మీరు మీమీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొవాలి. లేకుంటే బిజినెస్ జరగదు..’ అని చెప్పారు. సభ్యులు ఎంతకీ వెనక్కి వెళ్లకపోవడంతో స్పీకర్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాలపై చర్చను ప్రారంభించలేకపోతున్నాం..’ అని సుమిత్రా ప్రకటించారు. ఆ వెంటనే సభను మంగళవారానికి వాయిదావేశారు. చర్చ జరిగేంతవరకు ఎన్ని సార్లైనా అవిశ్వాసం నోటీసులు ఇస్తామని వైఎస్సార్‌సీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎడతెరిపిలేకుండా సాగిన నినాదాల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. దీంతో కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ మరోమారు నోటీసులు ఇవ్వనుంది. సోమవారం సభ ప్రారంభమైన మరుక్షణమే టీఆర్‌ఎస్, ఏఐడీఎంకేలు తమ తమ డిమాండ్లతో హోరెత్తించాయి. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు సభను వాయిదావేశారు. తిరిగి 12 గంటలకు సమావేశాలు పునఃప్రారంభమైనా.. నినాదాల జోరు తగ్గలేదు. స్పీకర్ పలుమార్లు అభ్యర్థించినా సభ్యులు శాంతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment