సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ముందుకు రావాల్సిఉండగా.. పార్లమెంట్ అనూహ్యంగా వాయిదాపడింది. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైంది. అప్పటికే కొన్ని స్పీకర్ వెల్‌లోకి వచ్చిన కొన్ని విపక్షాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయసాగాయి. ఒకటిరెండుసార్లు సర్దిచెప్పినా ఫలితంలేకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నానికి వాయిదావేశారు. ఇతంతా కేవలం 30 సెకన్లలోనే జరిగిపోయింది.
రాజ్యసభ రేపటికి : వివిధ పక్షాలు తమ తమ అజెండాలతో ఆందోళనలు చేపట్టడంతో రాజ్యసభ సైతం వాయిదాపడింది. ఎంత చెప్పినా సభ్యులు నిరసన వీడకపోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment