
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్, అన్నాడీఎంకేల నిరవధిక ఆందోళన కారణంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టాలని భావించారు. కానీ అప్పటికే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం నేడు సభముందుకు రానున్న దరిమిలా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
రాజ్యసభ కూడా: రెండో విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి దిగువ సభ మాదిరే పెద్దలసభలోనూ ఆందోళనలు వ్యక్తం తెలిసిందే. నేడు కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదావేశారు.