డీవీ మానర్‌కు జాతీయ టూరిజం అవార్డు | National Tourism Award to the DV Manor | Sakshi
Sakshi News home page

డీవీ మానర్‌కు జాతీయ టూరిజం అవార్డు

Published Sun, Jul 31 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

National Tourism Award to the DV Manor

నగరంలోని క్వాలిటీ హోటల్ డీవీ మానర్‌కు జాతీయ టూరిజం అవార్డు లభించింది. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, టూరిజం మంత్రి మహేష్‌శర్మ చేతుల మీదుగా హోటల్ ఎం.డి. ధనేకుల నాగేంద్రప్రసాద్, జనరల్ మేనేజర్ రాజేష్‌బెర్రీలు ఈ అవార్డును అందుకున్నారు.

 

ఆదివారం విజయవాడలోని హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 200కు పైగా నాలుగు నక్షత్రాల హోటల్స్ ఉండగా తమకు జాతీయ టూరిజం అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే తమ హోటల్‌కు ప్రతి ఏటా అవార్డులు లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, రానున్న కాలంలో హోటల్‌కు వచ్చే అతిథులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement