DV Manor
-
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ మృతి
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ రాజు (74) విజయవాడలోని డీవీ మేనర్ హోటల్లో శుక్రవారం రాత్రి మృతి చెందటం కలకలం సృష్టించింది. అయితే, ఆయనది సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు పోలీసులు. హైదబాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న శివకుమార్.. ఓ కేసు విషయంలో ఇటీవలే విజయవాడకు వచ్చారు. శనివారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బెల్ కొట్టినా రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది మరో తాళంచెవితో లోపలికివెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు శివకుమార్. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్లూస్ సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి.. కేసుగా నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్ చేసేలా విస్తరణ -
బెజవాడ బందరురోడ్డులో అగ్నిప్రమాదం
-
బెజవాడ బందరురోడ్డులో అగ్నిప్రమాదం
సాక్షి, విజయవాడ: నగరంలోని బందరు రోడ్డులో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డీవీ మనోహర్ హోటల్‌కు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ స్థలానికి ఒక వైపు హోటల్, మరోవైపు షాపింగ్ మాల్ ఉన్నాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక నిర్మాణంలో వస్త్రాలు, ఫ్యాషన్ మెటీరియల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఆస్తినష్టం ఎంతమేరకు జరిగిందనే దానికి స్పష్టత లేదు. -
డీవీ మానర్‌కు జాతీయ టూరిజం అవార్డు
నగరంలోని క్వాలిటీ హోటల్ డీవీ మానర్‌కు జాతీయ టూరిజం అవార్డు లభించింది. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, టూరిజం మంత్రి మహేష్‌శర్మ చేతుల మీదుగా హోటల్ ఎం.డి. ధనేకుల నాగేంద్రప్రసాద్, జనరల్ మేనేజర్ రాజేష్‌బెర్రీలు ఈ అవార్డును అందుకున్నారు. ఆదివారం విజయవాడలోని హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 200కు పైగా నాలుగు నక్షత్రాల హోటల్స్ ఉండగా తమకు జాతీయ టూరిజం అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే తమ హోటల్‌కు ప్రతి ఏటా అవార్డులు లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జాతీయ స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, రానున్న కాలంలో హోటల్‌కు వచ్చే అతిథులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.