
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మరోసారి అదే దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పట్టుదలగా పోరాడుతున్నా సభ సజా వుగా లేదంటూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు లోక్‌సభాపతి సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. వెల్‌లో ఆందోళన నిర్వహిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌లకు మరో పార్టీ జతకలవటంతో సభలో గందరగోళ పరిస్థి తులు నెలకొన్నాయి.
ఆర్జేడీ నుంచి గెలిచి జన్ అధికార్ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్న పప్పూయాదవ్ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో సభ సజావుగా లేదంటూ వైఎస్సార్ సీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగోసారీ అనుమతిం చలేదు.తీర్మానాన్ని బుధవారం నాటి సభాకార్యక్రమాల జాబితాలో చేర్చాలం టూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం మంగళవారం సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
సభ ప్రారంభం కాగానే
లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పక్షాలు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేయడంతో అప్పటికే ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ కొద్ది క్షణాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే వివిధ శాఖలకు చెపందిన పత్రాలను పలువురు మంత్రులు పార్లమెం ట్‌కు సమర్పిం చారు. సభ్యులంతా తమ స్థానా ల్లోకి వెళ్లాలని, అవిశ్వాస తీర్మానం సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కు మార్ పేర్కొ న్నారు. ఈ సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ పప్పూయాదవ్ ప్లకార్డులు ప్రదర్శించారు.
12.05 గంటలకు సభాపతి తనకు అందిన అవిశ్వాస తీర్మానం నోటీసుల ను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైవీ సుబ్బారెడ్డి, తోట నరసింహంనుంచి నోటీసు లు అందాయని చెప్పారు. ‘వీటిని సభ ముం దుంచడం నా బాధ్యత. ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యులు వారి స్థానాల్లో లేచి నిలుచుంటే లెక్కించేందుకు వీలుగా సభ సజావుగా నడవాలి. వారిని లెక్కించాక తీర్మానం ప్రవేశపె ట్టటంపై నిర్ణ యించగలను. సభ్యులంతా తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలి..’ అని సూచించారు.
తీర్మానానికి మద్దతుగా నిలుచున్న ఎంపీలు
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన రాగానే వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ, తదితర విపక్షాలకు చెందిన సభ్యులంతా మద్దతుగా నిలుచున్నారు. అయితే సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానాలను సభ ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ వైఎస్సార్ సీపీ ఆందోళన
ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ఆందోళన నిర్వహిం చారు. ప్రత్యేక హోదా ప్లకార్డును ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు కొద్ది క్షణాల్లోనే సభను గురువారానికి వాయిదావేశారు.
ఐదోసారి అవిశ్వాసం నోటీసులు
కేంద్రంపై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నరసింహం బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు ఐదో సారి నోటీసులను అందజేశారు.
పార్లమెంట్ వద్ద ధర్నా
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగప ల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.
ద్రోహివి నువ్వే
సీఎం వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు
రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. నాలుగేళ్లపాటు ప్రత్యేక హోదా అడగకుండా, హోదా అవసరం లేదని మంత్రివర్గంలో నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేసినవారిలో మొదటి వ్యక్తని మండిపడ్డారు.
బుధవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించిన బాబుకే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇన్నేళ్లుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజలకు బాగా తెలుసన్నారు.
Comments
Please login to add a commentAdd a comment