'నేను నాయనమ్మ అయిపోయా' | 'Dadi ma ho gayi mein', says new Speaker | Sakshi
Sakshi News home page

'నేను నాయనమ్మ అయిపోయా'

Published Fri, Jun 6 2014 4:04 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

'నేను నాయనమ్మ అయిపోయా'

'నేను నాయనమ్మ అయిపోయా'

తాను నాయనమ్మను అయిపోయానంటూ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్డీ సభ్యుడు దుష్యంత్ చౌతాలాతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సభ్యులందరిలోకి అత్యంత పిన్న వయస్కుడైన దుష్యంత్ (26).. సీనియర్ ఎంపీ అయిన సుమిత్రా మహాజన్ (71)ను అభినందిస్తూ మాట్లాడారు.

''మీరు మా ముత్తాత చౌదరి దేవీలాల్తోను, తాతయ్య ఓం ప్రకాష్ చౌతాలాతోను, నాన్న అజయ్ చౌతాలాతో కూడా కలిసి ఎంపీగా చేశారు. ఇప్పుడు అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. మీ మార్గదర్శకత్వంలో నేను నడుస్తా'' అని దుష్యంత్ అన్నారు. దాంతో, తానిప్పుడు నాయనమ్మ అయ్యానంటూ సుమిత్ర చమత్కరించారు. తనలాగే మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు దుష్యంత్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement