youngest mp
-
Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!
‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్ పార్లమెంట్ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్ హాల్ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు. -
Water Woman: అగాథా సంగ్మా గేమ్ చేంజర్
అగాథా సంగ్మా. ఆ పేరే ఓ రికార్డు. రాజకీయ దిగ్గజమైన తండ్రి పీఏ సంగ్మా వారసురాలిగా మేఘాలయలోని తుర నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టినా, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధిగా ఎదిగారు. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి బాధ్యతలు సమర్థంగా నిర్వహించి గేమ్ చేంజర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2014లో లోకసభ బరిలోంచి తప్పుకున్నా ‘అయాం నాట్ అ చైల్డ్ ఎనీమోర్’ అంటూ 2019లో లోక్‌సభ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈసారీ తురా నుంచే బరిలో ఉన్నారు... వాటర్ ఉమన్... తండ్రి పీఏ సంగ్మా రాజీనామాతో 2008లో అగాథా తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. తుర ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి దేశంలోనే యంగెస్ట్ ఎంపీగా నిలిచారు. తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గారు. 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రి అయ్యారు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగానూ చరిత్ర సృష్టించారు. అంతేగాక అసోంకు చెందిన రేణుకాదేవి బార్కాటకి అనంతరం ఈశాన్య రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి అయిన రెండో మహిళగా నిలిచారు. నీటికోసం నెత్తి మీద కుండతో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నుంచి మహిళలను బయటికి తేవడమే తన కల అని చెప్పే అగాథా వాటర్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈశాన్య గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అక్కడి వెనకబడ్డ ప్రాంతంలో కొత్త వెలుగులు నింపారు. 2012లో జరిగిన రాజకీయ పరిణామాలతో కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. 2014లో మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సౌత్ తుర నుంచి ఘనవిజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో మళ్లీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మాపై ఘనవిజయం సాధించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు గర్వంగా ఉందంటారామె. మేఘాలయ నుంచి మళ్లీ లోక్‌సభలో అడుగు పెడతారా అన్నది ఆసక్తికరం. పర్యావరణ ప్రేమిక... అగాథా సంగ్మా 1980 జూలై 24న ఢిల్లీలో జని్మంచారు. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్‌లో పెరిగారు. తురాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశారు. పుణె యూనివర్సిటీలో ఎల్ఎల్బీ అనంతరం ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్‌గా చేరారు. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ వర్సిటీలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. 2019లో పాట్రిక్ రోంగ్మా మారక్‌ను పెళ్లాడారు. పర్యావరణవేత్త అయిన అగాథా సందర్భం వచి్చనప్పుడల్లా ప్రకృతి పట్ల తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నారు. పెళ్లి కూడా పూర్తి పర్యావరణహిత పద్ధతిలో చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడానికి పెళ్లికి వచి్చనవారికి విత్తన పత్రాలిచ్చారు. నిశి్చతార్థ సమయంలోనూ మొక్కలు నాటారు. అగాథా పుస్తకాల పురుగు. సమయం దొరికిందంటే పుస్తకం పట్టుకుంటారు. అగాథా అంతే బాగా రాస్తారు కూడా. ఫొటోగ్రఫీ అన్నా ఆమెకు ప్రాణం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'నేను నాయనమ్మ అయిపోయా'
తాను నాయనమ్మను అయిపోయానంటూ లోక్‌సభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్డీ సభ్యుడు దుష్యంత్ చౌతాలాతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సభ్యులందరిలోకి అత్యంత పిన్న వయస్కుడైన దుష్యంత్ (26).. సీనియర్ ఎంపీ అయిన సుమిత్రా మహాజన్ (71)ను అభినందిస్తూ మాట్లాడారు. ''మీరు మా ముత్తాత చౌదరి దేవీలాల్తోను, తాతయ్య ఓం ప్రకాష్ చౌతాలాతోను, నాన్న అజయ్ చౌతాలాతో కూడా కలిసి ఎంపీగా చేశారు. ఇప్పుడు అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. మీ మార్గదర్శకత్వంలో నేను నడుస్తా'' అని దుష్యంత్ అన్నారు. దాంతో, తానిప్పుడు నాయనమ్మ అయ్యానంటూ సుమిత్ర చమత్కరించారు. తనలాగే మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు దుష్యంత్ చెప్పారు.