ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఆరో రోజు కూడా చర్చకు రాలేదు. వాయిదా అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన సభలో నినాదాలు మిన్నంటడంతో అవిశ్వాస తీర్మానం నోటీసులను సభలో ప్రవేశపెట్టలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సభ ఆర్డర్‌లో లేని కారణంగా మంగళవారానికి వాయిదావేశారు.