మళ్లీ మళ్లీ అవే దృశ్యాలు. అవే సన్నివేశాలు. సభ్యుల నుంచి అదే తీరు. స్పీకర్ నుంచి అవే మాటలు. వెరసి మంగళవారం కూడా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదు. అసలు పార్లమెంటు సమావేశాలే ముందుకుసాగలేదు. మంగళవారం ఉదయం ఇలా ప్రారంభమై.. ఆ వెంటనే అలా మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదాపడిన లోక్‌సభ.. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన ఎక్కువసేపు ఏమీ కార్యకలాపాలు జరగలేదు. ఎప్పటిలాగే అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి వెళ్లి.. నినాదాలతో హోరెత్తించారు. కావేరీ జలాల విషయమై అన్నాడీఎంకే సభ్యులు లోక్‌సభను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే.
అదే తీరు. .అవే మాటలు..
Published Tue, Apr 3 2018 1:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement