
న్యూఢిల్లీ : రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే పార్లమెంట్‌లో నిరసనలు వ్యక్తం అవుతుండటంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో కొద్ది నిమిషాలు మాట్లాడిన ఆమె.. ఎంపీల తీరును తప్పుపట్టారు.
‘‘సభ సజావుగా జరిగేలా సహకరించాలని నేను చేసిన మనవిని సభ్యులు పట్టించుకోలేదు. సభలోపల ప్లకార్డులు ప్రదర్శించడం, వెల్ లోకి దూసుకురావడం లాంటి చర్యలు ఆమోదనీయంకాదు. ఇలాంటివి.. ప్రపంచం దృష్టిలో మన సభకున్న గౌరవాన్ని దిగజార్చే అవకాశం ఉంది. కాబట్టి సభ్యులంతా హుందాగా ప్రవర్తించి, సభా మర్యాదను కాపాడాలి’ అని స్పీకర్ సుమిత్రా అన్నారు.