
విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్‌ఐ పంప్స్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2018’ని అందుకుంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకోవడం ఇది 4వసారి. వినూత్న రూపకల్పన, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను అందిస్తున్నాం. అనుకున్న కార్యంలో విజయవంతమైనందుకు కస్టమర్లు, డీలర్లు, స్టేక్ హోలర్లకు దన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment