CRI pumps Vice-Chairman
-
‘సీఆర్ఐ పంప్స్’కు ఎన్ఈసీ అవార్డ్
విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్ఐ పంప్స్ తాజాగా మరో అవార్డును సొంతం చేసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2018’ని అందుకుంది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెల్వరాజ్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అవార్డును అందుకోవడం ఇది 4వసారి. వినూత్న రూపకల్పన, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ కస్టమర్లకు విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్‌ను అందిస్తున్నాం. అనుకున్న కార్యంలో విజయవంతమైనందుకు కస్టమర్లు, డీలర్లు, స్టేక్ హోలర్లకు దన్యవాదాలు.’ అని వ్యాఖ్యానించారు. -
నీటి శుద్ధీకరణకు అత్యాధునిక పరిజ్ఞానం
వేస్ట్‌వాటర్ మేనేజ్మెంట్ కోసం సరికొత్త ఉత్పత్తులు సీఆర్ఐ పంప్స్ వైస్ చైర్మన్ సౌందరరాజన్ సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శుద్ధి జలాల లభ్యత చాలా తక్కువగా ఉందని సీఆర్ఐ పంప్స్ వైస్ చైర్మన్ సౌందరరాజన్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నీటి శుద్ధీకరణ కోసం అత్యాధునిక పరిజ్ఞానంతో సరికొత్త ఉత్పత్తులు చేపట్టినట్లు తెలిపారు.ఆదివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌందరరాజన్ మాట్లాడుతూ దేశంలో రోజూ 1.5ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉండగా 740బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే లభిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మురికినీటిని సైతం తిరిగి స్వచ్ఛమైన నీటిగా మార్చే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కోసం తాము అధిక శాతంలో నిధులను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే తమ సంస్థ ఇటలీకి చెందిన ఎఫ్ఐపీఎస్ పంప్స్ అండ్ మోటార్స్ సంస్థను కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానంతో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను తయారుచేయనున్నట్లు తెలిపారు.