నీటి శుద్ధీకరణకు అత్యాధునిక పరిజ్ఞానం | Advanced water treatment technology | Sakshi
Sakshi News home page

నీటి శుద్ధీకరణకు అత్యాధునిక పరిజ్ఞానం

Published Mon, May 12 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

నీటి శుద్ధీకరణకు అత్యాధునిక పరిజ్ఞానం

నీటి శుద్ధీకరణకు అత్యాధునిక పరిజ్ఞానం

  • వేస్ట్‌వాటర్  మేనేజ్‌మెంట్ కోసం సరికొత్త ఉత్పత్తులు
  • సీఆర్‌ఐ పంప్స్   వైస్ చైర్మన్  సౌందరరాజన్
  •  సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శుద్ధి జలాల లభ్యత చాలా తక్కువగా ఉందని సీఆర్‌ఐ పంప్స్ వైస్ చైర్మన్ సౌందరరాజన్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో నీటి శుద్ధీకరణ కోసం అత్యాధునిక పరిజ్ఞానంతో సరికొత్త ఉత్పత్తులు చేపట్టినట్లు తెలిపారు.ఆదివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌందరరాజన్ మాట్లాడుతూ దేశంలో రోజూ 1.5ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉండగా 740బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే లభిస్తోందన్నారు.

    ఈ నేపథ్యంలో మురికినీటిని సైతం తిరిగి స్వచ్ఛమైన నీటిగా మార్చే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ కోసం తాము అధిక శాతంలో నిధులను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే తమ సంస్థ ఇటలీకి చెందిన ఎఫ్‌ఐపీఎస్ పంప్స్ అండ్ మోటార్స్ సంస్థను కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానంతో వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను తయారుచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement