లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్! | Sumitra Mahajan elected as Speaker of Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్!

Published Fri, Jun 6 2014 4:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్! - Sakshi

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్!

  • నేడు లాంఛనంగా ఎన్నిక
  • డిప్యూటీ స్పీకర్‌గా తంబిదురై!
  • న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ నేత సుమిత్రా మహాజన్ ఎన్నిక ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు 16వ లోక్‌సభ స్పీకర్‌గా మహాజన్ పేరును ప్రతిపాదించారు. ఈ పదవి కోసం గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లు దాఖలు చేయూల్సి ఉండగా.. ఆ గడువులోగా కేవలం సుమిత్రా మహాజన్ పేరుకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చారుు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనంగా శుక్రవారం జరగనుంది.
     
    మహాజన్ పేరును ప్రతిపాదించిన మొత్తం 19 మందిలో.. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే సహా ప్రతిపక్ష నేతలు ఎం.తంబిదురై (ఏఐఏడీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), బి.మహతాబ్ (బీజేడీ), ములాయంసింగ్ యూదవ్ (ఎస్పీ), హె.డి.దేవెగౌడ (జేడీఎస్), సుప్రియా సూలే (ఎన్సీపీ), మొహమ్మద్ సలిప్ (సీపీఎం) కూడా ఉన్నారు. మోడీతో పాటు ఆమె పేరును ప్రతిపాదించిన బీజేపీ నేతల్లో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాల  నేతలు పలువురు కూడా మహాజన్ పేరును ప్రతిపాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు మహాజన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి సమ్మతించారు.
     
    మహాజన్‌కు మద్దతుగా తమ పార్టీ ఎంపీల సంతకాలతో వెంకయ్యనాయుడుకు లేఖ సమర్పించినట్లు టీఆర్‌ఎస్ నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇలావుండగా డిప్యూటీ స్పీకర్‌గా ఏఐఏడీఎంకే సభ్యుడు తంబిదురై పేరు చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఇటీవల ప్రధాని మోడీతో సుదీర్ఘంగా సమావేశం కావడం, తంబిదురై ఎన్నికపై ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఈయన గతంలోనూ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు.
     
     ఎనిమిది సార్లు ఎన్నికతో ‘తారుు’ రికార్డు
     డెబ్బై రెండేళ్ల సుమిత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యూరు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 8సార్లు ఎన్నికైన మహిళా పార్లమెంటేరియన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. మృదు స్వభావి అరుున, ప్రేమతో ‘తారుు’ (మరాఠీలో పెద్ద సోదరి)గా పిలుచుకునే ఆమెకు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. ఈమె న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తన సతీమణి ఏనాటికైనా మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని సుమిత్ర భర్త దివంగత జయంత్ వామన్ మహాజన్ కోరుకున్నారు. అరుుతే ఆమె 8 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగలిగారు కానీ సీఎం కాలేకపోయూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement