Speaker of Lok Sabha
-
ఎమర్జెన్సీ.. చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ. నిన్నటికి నిన్న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఓం బిర్లా నోట సభలో విన్పించిన మాట. గురువారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలోనూ ప్రముఖంగా చోటుచేసుకుంది! ఇందిరాగాంధీ హయాంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా, రాజ్యాంగంపై దాడిగా రాష్ట్రపతి అభివరి్ణంచారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో రాజ్యాంగంపై ఇలాంటి దాడులు జరుగుతూ వచ్చాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీపై దేశమంతా భగ్గుమంది.అంతిమంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై దేశం విజయం సాధించి ప్రగతి పథాన సాగుతోంది’’ అన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా మాత్రమే చూడటం లేదు. దాన్ని ప్రజల చేతనలో అవిభాజ్య భాగంగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం వంటి చర్యలు అందులో భాగమే’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ ఎమర్జెన్సీపై తరచూ విమర్శలు చేస్తూ వస్తోంది.ప్రధాని మోదీ జూన్ 24న మాట్లాడుతూ ఎమర్జెన్సీని దేశ పార్లమెంటరీ చరిత్రలో చెరగని మచ్చగా అభివ రి్ణంచారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా బుధవారం గాజియాబాద్‌లో ఒక కార్యక్రమంలో ఎమర్జెన్సీపై విమర్శలు గుప్పించారు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవుతూనే ఎమర్జెన్సీని నిరసిస్తూ లోక్‌సభలో ఏకంగా తీర్మానమే చేసి రాజకీయ దుమారానికి తెర తీశారు.పరీక్షల విధానంలో సంస్కరణలున్యూఢిల్లీ: ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు ముర్ము గుర్రపు బగ్గీలో సంప్రదాయ రీతిలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. గజ ద్వారం వద్ద ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముర్ము తన ప్రసంగంలో మోదీ 3.0 ప్రభుత్వ ప్రాథమ్యాలను ఒక్కొక్కటిగా వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు వరుసగా మూడోసారి సుస్థిరతకే పట్టం కట్టారు’’ అన్నారు.‘‘లోక్‌సభ సభ్యులుగా మీరంతా ప్రజల నమ్మకం చూరగొని నెగ్గారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. భారత్ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్ని ప్రపంచమంతా వేయి కళ్లతో గమనిస్తోందన్న విషయాన్ని సభ్యులు గుర్తెరగాలన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దీనిపై పారీ్టలకు అతీతంగా దేశవ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ దిశగా పరీక్షల విధానంలోనే సమూల సంస్కరణలకు కేంద్రం సిద్ధమవుతోంది’’ అని చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలను బలోపేతం చేసి వాటిల్లో సీట్లను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులంతా ‘నీట్, నీట్’ అంటూ జోరుగా నినాదాలు చేశారు. పలు ఇతర అంశాలపై రాష్ట్రపతి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...⇒ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్నీ ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈవీఎంలు సుప్రీంకోర్టు నుంచి ప్రజా కోర్టు దాకా అన్ని పరీక్షల్లోనూ నెగ్గి విశ్వసనీయతను నిరూపించుకున్నాయి. ⇒ కొన్నాళ్లుగా భారత్ అనుసరిస్తున్న సమర్థమైన విదేశీ విధానం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి అంతర్జాతీయ సమస్యపైనా తక్షణం స్పందిస్తూ క్రమంగా విశ్వబంధుగా పరిణతి చెందుతోంది. భారత్–మధ్య ప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్ 21వ శతాబ్దంలో అతి పెద్ద గేమ్ చేంజర్‌గా మారనుంది. ⇒ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం వేరు. పార్లమెంటు కార్యకలాపాలను ఆటంకపరచడం వేరు. ఇది పూర్తిగా తప్పుడు చర్య. పార్లమెంటు సజావుగా సాగినప్పుడే ప్రజా సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలు సాధ్యమని అన్ని పారీ్టలూ గుర్తుంచుకోవాలి. ⇒ కశ్మీర్ లోయలో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. తద్వారా శత్రు దేశాలకు కశ్మీరీ ప్రజలు దిమ్మతిరిగే జవాబిచ్చారు. ఆరి్టకల్ 370 రద్దుతో రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమల్లోకి వచి్చన తర్వాత కశ్మీర్లో పరిస్థితులు ఎంతగానో మెరుగుపడుతున్నాయి. ⇒ మౌలికాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోంది. దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు దిశల్లో బులెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ⇒ తప్పుడు సమాచార వ్యాప్తి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు విభజన శక్తులు దీన్ని ఆయుధంగా వాడుతున్నాయి. ఈ బెడద నివారణకు కొత్త మార్గాలు వెదకాల్సిన అవసరం చాలా ఉంది. ⇒ దేశ విభజనతో సర్వం కోల్పోయిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు పౌరసత్వ సవరణ చట్టం దోహదపడుతుంది. ⇒ శిక్షించడమే ప్రధానోద్దేశంగా రూపొందిన బ్రిటిష్ వలస పాలన నాటి శిక్షా స్మృతులు స్వాతంత్య్రం వచ్చాక కూడా ఏడు దశాబ్దాల పాటు కొనసాగడం దారుణం. న్యాయం శిక్షగా మారకూడదన్నదే లక్ష్యంగా, భారతీయతే మూలమంత్రంగా నూతన నేర న్యాయ చట్టాల రూపకల్పన జరిగింది. జూలై 1 నుంచి అవి ప్రజలకు సరైన న్యాయాన్ని సత్వరంగా అందించనున్నాయి. ⇒ అభివృద్ధితో పాటు దేశ ఘన వారసత్వానికీ మోదీ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వనుంది. మహిళల సారథ్యంలో అభివృద్ధికి కట్టుబడి ఉంది. చట్టసభల్లో వారికి 33 శాతం రిజర్వేషన్ల వంటి నిర్ణయాలు ఈ దిశగా ముందడుగులు. ⇒ రక్షణ రంగంలో భారీ సంస్కరణలు మరింత వేగంతో కొనసాగుతాయి. పదేళ్లలో రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగాయి. అదే సమయంలో గతేడాది మన రక్షణ కొనుగోళ్లలో 70 శాతం స్వదేశీ సంస్థల నుంచే జరిగింది! ఈ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం పెరగనుంది. ⇒ సుపరిపాలనకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. పలు ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల రద్దు, స్వీయ ధ్రువీకరణ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణలు. ⇒ సంస్కరణల పథాన్ని వేగవంతం చేసే దిశగా వచ్చే బడ్జెట్లో చరిత్రాత్మక చర్యలుంటాయి. -
ఓమ్ బిర్లాకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉన్న బీజేపీ ఎంపీ ఓమ్ బిర్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లాను ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి సంతకం చేశారు. ఓమ్ బిర్లాలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఓమ్ బిర్లా రాజస్తాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. కోట-బుండి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌నారాయణ్ మీనాపై 2.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా నియామకం దాదాపుగా పూర్తి అయినట్లు వస్తున్న వార్తలపై ఆయన భార్య అమితా బిర్లా స్పందించారు.‘ ఇది మాకు చాలా గర్వకారణమైన,సంతోషకరమైన సమయం. ఓమ్ బిర్లాను స్పీకర్ గా ఎన్నుకుంటున్నందుకు కేబినెట్ ధన్యవాదాలు చెబుతాను’ అని అబితా బిర్లా పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఓమ్ బిర్లా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోక్ సభ స్పీకర్ ఎన్నికపై తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఓ కార్యకర్తలానే నడ్డాతో సమావేశమైనట్లు తెలిపారు.కాగా ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్ నియాకమైన విషయం విదితమే. స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్‌గా కొనసాగనున్నారు. -
అవసరమైతే కఠినంగా వ్యవహరిస్తా
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ న్యూఢిల్లీ: మృదు స్వభావిగా, నిదానస్తురాలిగా పేరొంది అందరూ ఎంతో ప్రేమతో ‘అక్క’ అని పిలుచుకునే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. తాను ఎంత మృదు స్వభావినైనప్పటికీ సభ అవసరాల దృష్ట్యా సభ్యులను నియంత్రించాల్సి వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించడంలో తటపటాయించబోనని పీటీఐతో పేర్కొన్నారు. ‘సభ్యులతో నా వ్యవహార శైలి సాధారణంగానే ఉంటుంది. అయితే, సభ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు సజావుగా సాగేందుకు అవసరమైతే కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోను’ అని ఆమె చెప్పారు. సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించే ఎంపీలకు ముకుతాడు వేసేందుకు నిబంధనలను రూపొందిస్తారా అన్న ప్రశ్నకు.. అవసరమైతే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోవచ్చని, సభ్యులకు వారి బాధ్యతలను పూర్తిగా తెలియజేయడమే ప్రధాన అంశమని పేర్కొన్నారు. -
లోక్‌సభకు 10 మంది చైర్పర్సన్లు
కమిటీని ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ టీడీపీ నుంచి కే నారాయణకు అవకాశం న్యూఢిల్లీ: లోక్‌సభ వ్యవహారాలను సజావుగా నడిపేలా స్పీకర్‌కు సహకారం అందించేందుకు 10 మంది చైర్పర్సన్లను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎంపిక చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగకపోవచ్చని స్పీకర్ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కొనకళ్ల నారాయణ సహా 10 మంది చైర్పర్సన్లతో ఒక కమిటీని ఆమె సోమవారం ప్రకటించారు. చైర్పర్సన్లుగా ఎంపికైన వారిలో బీజేపీకి చెందిన హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్, ప్రహ్లాద్ జోషీ, హుకుమ్ సింగ్, రామణ్ దేకలతో పాటు అర్జున్ చరణ్ సేథీ(బీజేడీ),తంబిదురై(అన్నాడీఎంకే), కేవీ థామస్(కాంగ్రెస్), ఆనంద్‌రావు అద్సుల్(ఎస్ఎస్), రత్న డే(తృణమూల్) ఉన్నారు. -
మళ్లీ మహిళకే పట్టం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ 16వ లోక్‌సభ స్పీకర్‌గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీరా కుమార్ తర్వాత సభాపతి స్థానాన్ని అధిష్టించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. ఎనిమిదోసారిగా ఎంపీగా ఎన్నికైన 71 ఏళ్ల మహాజన్ పేరును.. స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ బలపరిచారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఇలాంటివే మరో 13 తీర్మానాలను ప్రతిపాదించాయి. ప్రతిపక్షాలు కూడా మహాజన్‌కు మద్దతు తెలపడంతో ప్రోటెం స్పీకర్ కమల్‌నాథ్ మూజువాణి ఓటుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ప్రధాని, అద్వానీ, వెంకయ్యనాయుడు, అనంత్ గీతే(శివసేన), ఎం.తంబిదురై(అన్నా డీఎంకే)లతోపాటు విపక్ష నేతలు మల్లిఖార్జున ఖర్గే(కాంగ్రెస్), ములాయంసింగ్ యాదవ్(ఎస్పీ), సుదీప్ బందోపాధ్యాయ(తృణమూల్కాంగ్రెస్)లు మహాజన్‌ను స్వయంగా స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. సభ తనకు గురుతరమైన బాధ్యతలు అప్పగించిందని, రాగద్వేషాలకు అతీతంగా సభ్యులందరికీ న్యాయం చేస్తానని స్పీకర్ స్థానంలో కూర్చున్న మహాజన్ చెప్పారు. పేరులోనే మిత్రత్వం ఉంది: అనంతరం ప్రధాని మోడీ సహా పలువురు నేతలు మహాజన్‌ను అభినందిస్తూ సభలో ప్రసంగించారు. పోటీ లేకుండా స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునే గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టినందుకు అన్ని పార్టీలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. సుమిత్ర పేరులోనే మిత్రత్వం ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేవాలయంలాంటి చట్టసభ ఒక మహిళ ఆధ్వర్యంలో నడవడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఆమె నేతృత్వంలో సభ సజావుగా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సభ సాగేందుకు స్పీకర్‌కు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ‘‘ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సభ్యురాలిగా ప్రజాజీవితం ప్రారంభించిన మహాజన్ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు ఎనిమిదోసారి ఎంపీగా గెలిచారు. ఎన్నడూ లేని విధంగా ఈ 16వ లోక్‌సభలో ఏకంగా 315 మంది ఎంపీలు మొదటిసారి గెలిచినవారే ఉన్నారు. ఈ కొత్త రక్తం, కొత్త ఆకాంక్షలను మన మహోన్నతమైన సంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్లాలి’’ అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ‘మహాజనో యేన గతస్య పంథా’ (గొప్పవాళ్ల అడుగుజాడల్లో నడవాలి) అంటూ సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు. ‘మహాజన్’లాంటి గొప్పవారు ఈ సభను నడిపితే అంతకన్నా మనకేం కావాలి..? అని అన్నారు. అనంతరం సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. స్పీకర్ సభలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ‘‘మీరు అందరినీ సంతృప్తిపర్చలేరని తెలుసు. కానీ ఒక పెద్దక్క తరహాలో పార్టీలు చిన్నవైనా, పెద్దవైనా వాటి ప్రయోజనాలను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. మన్మోహన్ అభినందనలు: స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమెకు ఒక లేఖ పంపారు. సుమిత్ర అపార అనుభవం సభకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష హోదా’పై ఆచితూచి... కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కల్పిస్తారా లేదా అన్న అంశంపై కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఆచితూచి స్పందించారు. ‘‘దీనిపై చర్చించాల్సి ఉంది. గతంలో ఉన్న సంప్రదాయాలను ఓసారి పరిశీలించాలి. కొంత అధ్యయనం చేయాలి. తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆమె చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్దిపాటి సమయమే ఉన్నందున ప్రస్తుత సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోకపోవచ్చని తెలిపా రు. రానున్న బడ్జెట్ సమావేశాలపై మాట్లాడుతూ.. జూలై 28 కల్లా బడ్జెట్‌కు ఆమోదం తెలపాల్సి ఉన్నందున అన్ని పార్టీల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంద న్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తావించ గా..‘ఒక మహిళను అయి ఉండి నేను మహిళలను ఎలా మర్చిపోతాను’ అన్నారు. కాగా, అన్ని పార్టీల మధ్య సమన్వ యం సాధించి, సభ సజావుగా సాగేందుకే కృషి చేయడమే తన తొ లి ప్రాధాన్యమని పీటీఐ ఇంటర్వ్యూలో సుమిత్ర చెప్పారు. మౌలంకర్ను మరిపించండి కొత్త స్పీకర్‌కు మన ఎంపీల అభినందనలు న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలు శుక్రవారం అభినందనలు తెలిపారు. లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మౌలంకర్ మాదిరిగా ఆమె పేరు కూడా కలకాలం నిలిచిపోవాలని టీడీపీ నేత, పౌర విమానయాన మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఆకాంక్షించారు. సుమిత్రకు వైఎస్సార్సీపీ తరఫున, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నట్టు వైఎస్సార్సీపీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తన హుందాతనం, ఓర్పుతో సభను ఫలప్రదంగా, నిష్పాక్షికంగా నడపగలరని ఆశాభావం వెలిబుచ్చారు. తమ పార్టీ సభ్యులంతా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఐదు రోజుల వయసున్న తెలంగాణను చంటిపాపలా చూడాలని టీఆర్ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ తరఫున ఆమెకు అభినందనలు అందజేశారు. కమలం గుర్తున్న బీజేపీ తరఫున గెలిచిన సుమిత్ర, నీటిలోనే ఉన్నా ఆ తడిని తనకు అంటనివ్వని కమలంలా వ్యవహరిస్తారని మజ్లిస్ పక్ష నేత అసదుద్దీన్ ఒవైసీ ఆశాభావం వెలిబుచ్చారు. -
లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్!
నేడు లాంఛనంగా ఎన్నిక డిప్యూటీ స్పీకర్‌గా తంబిదురై! న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ నేత సుమిత్రా మహాజన్ ఎన్నిక ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు 16వ లోక్‌సభ స్పీకర్‌గా మహాజన్ పేరును ప్రతిపాదించారు. ఈ పదవి కోసం గురువారం మధ్యాహ్నంలోగా నామినేషన్లు దాఖలు చేయూల్సి ఉండగా.. ఆ గడువులోగా కేవలం సుమిత్రా మహాజన్ పేరుకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చారుు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనంగా శుక్రవారం జరగనుంది. మహాజన్ పేరును ప్రతిపాదించిన మొత్తం 19 మందిలో.. లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే సహా ప్రతిపక్ష నేతలు ఎం.తంబిదురై (ఏఐఏడీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), బి.మహతాబ్ (బీజేడీ), ములాయంసింగ్ యూదవ్ (ఎస్పీ), హె.డి.దేవెగౌడ (జేడీఎస్), సుప్రియా సూలే (ఎన్సీపీ), మొహమ్మద్ సలిప్ (సీపీఎం) కూడా ఉన్నారు. మోడీతో పాటు ఆమె పేరును ప్రతిపాదించిన బీజేపీ నేతల్లో రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. అధికార ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పలువురు కూడా మహాజన్ పేరును ప్రతిపాదించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు మహాజన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి సమ్మతించారు. మహాజన్‌కు మద్దతుగా తమ పార్టీ ఎంపీల సంతకాలతో వెంకయ్యనాయుడుకు లేఖ సమర్పించినట్లు టీఆర్ఎస్ నేత జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇలావుండగా డిప్యూటీ స్పీకర్‌గా ఏఐఏడీఎంకే సభ్యుడు తంబిదురై పేరు చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఇటీవల ప్రధాని మోడీతో సుదీర్ఘంగా సమావేశం కావడం, తంబిదురై ఎన్నికపై ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఈయన గతంలోనూ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎనిమిది సార్లు ఎన్నికతో ‘తారుు’ రికార్డు డెబ్బై రెండేళ్ల సుమిత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యూరు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 8సార్లు ఎన్నికైన మహిళా పార్లమెంటేరియన్‌గా ఆమె రికార్డు సృష్టించారు. మృదు స్వభావి అరుున, ప్రేమతో ‘తారుు’ (మరాఠీలో పెద్ద సోదరి)గా పిలుచుకునే ఆమెకు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. ఈమె న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తన సతీమణి ఏనాటికైనా మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని సుమిత్ర భర్త దివంగత జయంత్ వామన్ మహాజన్ కోరుకున్నారు. అరుుతే ఆమె 8 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగలిగారు కానీ సీఎం కాలేకపోయూరు.