
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించేందుకు టీడీపీ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్‌లో హంగామా సృష్టించారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత కూడా ఆందోళన పేరిట వారు సభ లోపలే ఉండిపోయారు. ఇంతలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుస్తున్నారంటూ ఆమె కార్యాలయ సిబ్బంది చెప్పడంతో టీడీపీ ఎంపీలు బయటకు వచ్చారు.
స్పీకర్ చాంబర్‌కు వెళ్లగా అప్పటికే ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయారు. దీంతో అవాక్కయిన టీడీపీ ఎంపీలు తిరిగి సభ లోపలికి వెళ్లి ఆందోళనకు దిగాలని భావించగా.. భద్రతా సిబ్బంది అప్పటికే లోక్‌సభ తలుపులను మూసివేశారు. కంగుతిన్న టీడీపీ ఎంపీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి అక్కడే బైఠాయించడంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారంతా పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్దకు ధర్నా నిర్వహించి వెనుతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment