సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్.. ఎన్నికలకు ముందు రానున్న ప్రజాకర్షక బడ్జెట్.. ఇలా ఎన్నోవిశేషణాలను సొంతం చేసుకున్న బడ్జెట్-2018 మరో మూడు రోజుల్లో ప్రజల ముందుకు రానుంది. రేపటి(జనవరి 29) నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రాంరభంకానున్నాయి. ఫిబ్రవకి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర ప్రభుత్వాలు ఆదివారం సాయంత్ర విడివిడిగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
వైఎస్సార్‌సీపీ తరఫున విజయసాయిరెడ్డి : ఆదివారం ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు గళంవిప్పనున్నారు.
రెండు విడదల్లో బడ్జెట్ సమావేశాలు : ఆనవాయితీ ప్రకారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో రేపు(సోమవారం) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు మొదటి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడతగా పార్లమెంట్ భేటీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment