కాంగ్రెస్‌ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ | anurag thakur slams on congress over Property To Muslims | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

Published Sun, Apr 28 2024 8:45 AM | Last Updated on Sun, Apr 28 2024 8:45 AM

anurag thakur slams on congress over Property To Muslims

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.  సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్‌ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని మండిపడ్డారు. శనివారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్‌పూర్‌లో నిర్వహించిన  ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెనక కాంగ్రెస్‌తో పాటు విదేశీ హస్తం ఉంది. మీ(ప్రజల) పిల్లల ఆస్తులను ముంస్లికు ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేయనున్నారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని విభజించనున్నారు. టుక్డే-టుక్డే గ్యాంగ్‌ కాంగ్రెస్‌ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్‌ చేస్తోంది. మీ( ప్రజలు) సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదు. ఎందుకుంటే  అవి ప్రజలందరి హక్కు’ అని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

 

అనురాగ్‌ ఠాకుర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌  సెక్రటరీ జైరాం రమేష్‌  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఠాకుర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement