కోల్‌కతా : బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరంలో తొలి రోజు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో... 14 మందితో కూడిన టెస్టు బృందం తమ ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంది. దీనికోసం సాయంత్రం 4.45 గంటలకు మైదానంలో ప్రవేశించిన ఆటగాళ్లు రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేశారు. హర్భజన్, ఇషాంత్, కోహ్లి తదితరులు 20మీ. దూరం వేగంగా రన్నింగ్ చేశారు. శనివారం తన 27వ పుట్టిన రోజు జరుపుకున్న రహానే సహచరుల మధ్య కేక్ కట్ చేశాడు.