Ravi sastri
-
'ఆసీస్‌తో మూడో టెస్టు.. రోహిత్ శర్మ ఓపెనర్‌గానే రావాలి'
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైన విషయం విధితమే. రెండు ఇన్నింగ్స్‌ల్లో 3, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే ఈ పింక్ బాల్ టెస్టులో తన ఓపెనింగ్ స్ధానాన్ని కేఎల్ రాహుల్‌కు త్యాగం చేసిన రోహిత్ శర్మ.. ఏకంగా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ శర్మ తన భార్య రెండో కాన్పు కోసం తొలి టెస్టుకు గైర్హారయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. పెర్త్ టెస్టులో రాహుల్ బాగా రాణించడంతో రెండో టెస్టులో కూడా అతడినే ఓపెనర్‌గా కొనసాగించింది. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ మెనెజ్‌మెంట్ నిర్ణయం బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, రవిశాస్త్రి జట్టు మెనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశారు. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎప్పట్లాగే ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయాలని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు.‘రోహిత్ దూకుడుగా ఆడాలంటే అతనికి ఓపెనింగ్ స్థానమే సరైంది. తన శైలి ఆటతీరు ఆవిష్కృతం కావాలంటే, యథేచ్ఛగా బ్యాటింగ్ చేయాలంటే తనకు నూటికినూరు శాతం నప్పే ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగాలి. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ అంత సౌకర్యంగా కన్పించలేదు. అతడు కొంచెం డీలా పడినట్లు అన్పించిందని శాస్త్రి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదే విధంగా ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ టాక్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. "రోహిత్ తిరిగి మళ్లీ తన ఓపెనింగ్ స్ధానానికి రావాలి. రాహుల్ ఎందుకు ఓపెన్ చేశాడో మనకు అందరికి తెలుసు. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేనందున రాహుల్ ఆ స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.ఆ మ్యాచ్‌లో జైశ్వాల్‌తో కలిసి 200 పరుగుల పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అందుకే రెండో టెస్టులో కూడా రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు రాణించలేకపోయాడు. కాబట్టి రోహిత్ మళ్లీ ఓపెనర్‌గా రావాలని నేను భావిస్తున్నాను" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: IND vs AUS: 'రోహిత్ ఇంకేం నిరూపించుకోవాలి.. అతడి సత్తా ఏంటో మనకు తెలుసు' -
భారత క్రికెట్లో తీవ్ర విషాదం.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మృతి
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సలీం దురానీ కన్నుమూశారు. 88 ఏళ్ల వయస్సు ఉన్న సలీం దురానీ తన స్వస్థలం జామ్‌నగర్‌లో తుదిశ్వాస విడిచారు. కాగా కొన్ని రోజుల క్రితం దురానీ తన ఇంటివద్ద పడిపోవడంతో తొడ ఎముక విరిగింది. అనంతరం ఈ ఏడాది జనవరిలో దురానీ ప్రాక్సిమల్ ఫెమోరల్ నెయిల్ సర్జరీ(తొడ ఎముక సర్జరీ) చేయంచుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే అతను మృతి చెందారు. సలీం దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ నగరంలో జన్మించారు. అఫ్గానిస్థాన్‌లో జన్మించిన ఆయన 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 1973లో ఇంగ్లండ్‌తో చివరి టెస్టు ఆడారు. 13 ఏళ్ల కెరీర్లో దురానీ భారత్ తరపున మొత్తం 27 టెస్టులు ఆడాడు. 27 టెస్టుల్లో 1202 పరుగులతో పాటు 78 వికెట్లు సాధించారు. అతని కెరీర్లో ఒక సెంచరీ పాటు 7 అర్ధ శతకాలు ఉన్నాయి. అదే విధంగా 1971లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చారిత్రత్మక విజయం అందుకోవడంతో దురానీ కీలక పాత్ర పోషించారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం దురానీ.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నటుడు ప్రవీన్ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు. ఇక దురానీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని రవిశాస్త్రి గుర్తుచేసుకున్నారు. Salim Durani Ji was a cricketing legend, an institution in himself. He made a key contribution to India’s rise in the world of cricket. On and off the field, he was known for his style. Pained by his demise. Condolences to his family and friends. May his soul rest in peace. — Narendra Modi (@narendramodi) April 2, 2023 చదవండి: IPL 2023: రాజస్తాన్‌తో ఎస్ఆర్హెచ్ ఢీ.. అతడిపైనే అందరి కళ్లు -
బాలీవుడ్ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి!
న్యూఢిల్లీ: భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏదో రకంగా నిలుస్తూనే ఉంటాడు. ఎందుకోగానీ రవిశాస్త్రి విషయంలో నెటిజన్లు ట్రోలింగ్‌కు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ స్థానంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన సందర్భంగా మరోసారి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. కాగా ఈ విషయంపై 2018 ఇంగ్లండ్ పర్యటనలోనే రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో దర్శనమిస్తోంది. 2016లో నిమ్రత్ కౌర్‌తో కలిసి జర్మన్ బ్రాండ్ ఆడీ కారు ఓపెనింగ్‌కు రవిశాస్త్రి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని పార్టీలు, పలు కార్యక్రమాలల్లో నిమ్రత్‌తో కలిసి కనిపించాడు. ఇక ఏముంది నెట్టింట వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లాడబోతున్నాడని అప్పట్లో పుకార్లు ఓ రేంజ్‌లోనే వచ్చాయి. దీంతో రవి ముంబై టాబ్లాయిడ్‌కు ఈ వియంపై ఘటుగానే జవాబిచ్చాడు. 2018 ఇంగ్లండ్ పర్యటనకు ముందు మిడ్ డే దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఇదంతా పెంట వ్యవహారమని, ఇలాంటి వాటిని తన ముందు ప్రస్తావించవద్దని ఘాటుగా బదులిచ్చాడు. 'ఏముంది చెప్పడానికి ఇదంతా పెంట యవ్వారం. పెంట అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ రూమర్స్‌ను నిమ్రత్ కౌర్ కూడా అప్పట్లో ఖండించింది. ఇక బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్‌తో ప్రేమాయణం నడిపిన రవిశాస్త్రి.. ఆ తర్వాత 1990లో రితూ సింగ్‌ను పెళ్లాడాడు. చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. -
పువ్వుల కన్నీళ్ళు
దాదాపు అన్ని మొక్కలూ మొగ్గతొడిగేయి. అందుమీదట ఏ మొక్క ముందు పూస్తుందనే ప్రశ్న వచ్చింది. మొదటి వరుసలోదా, మూడో వరుసలోదా? రెండు ఇళ్లకి మధ్యనున్న బంతిమొక్కల పక్కన రాతిమీద కూర్చొని, మొక్కలవైపూ మొక్కల్లోకీ చూస్తోంది కమలబాల.ఊరవతల తోట. ‘ది గార్డెను’ అది. తోటమధ్య పెద్దమేడ. అది మెయిన్ హవుసు. మేడకి కొంచెం పడమటగా చిన్న పెంకుటిల్లు. అది గెస్ట్ హవుసు.మేడగల పెద్దమనిషి కలకత్తాలో వ్యాపారంగల మనిషి. అతగాడు ప్రతియేటా వేసంగికి మాత్రం చల్లగాలికోసం స్వంతవూరుకి కుటుంబంతో సహా వచ్చి నెల్లాళ్లుండి వెళ్లే అలవాటుగల పెద్దమనిషి. ఆయన కలకత్తాలో ఉండేప్పుడు, ఇక్కడ మేడని అద్దెకి ఇవ్వవచ్చు. కాని దిగినవాళ్లని ప్రతియేటా వేసంగికి ఖాళీ చేయమనడం బావుండదు. అందుచేత మేడ ఇంటిని తాళాలు బిగించి ఉంచేరు. గెస్ట్ హవుసుని మాత్రం అద్దెకిచ్చేరు. ఇల్లు చిన్నదైనప్పటికీ, ఊరికి దూరంగా ఉన్నప్పటికీ, అద్దె తక్కువ కాబట్టి అందులో ప్రవేశించేరు అవతారం గారు.కిందటేడు ఏప్రెల్‌లో, కమల మూడో ఫారం పరీక్ష రాసి పాసయిన రోజుల్లో ఆమెకు పన్నెండోయేడు దాటింది. వెంటనే ఈ యింట్లోకి వచ్చి పడింది.‘‘స్కూలు ఇక్కడికి చాలాదూరం, అవునా? ఒక్కర్తెవీ అంతదూరం నడిచి వెళ్లలేవు కద. థర్డుఫారం ఫస్టుగా పాసయేవు. ఏం చాల్దూ? సీతాలక్ష్మిని చూడు, ఎమ్మే పాసయిందా? పాసవుతేమాత్రం పెళ్లి చేసుకోక తప్పిందా?’’ అంటూ కొన్ని కారణాలు చెప్పి కమలని స్కూల్ మాన్పించివేసేరు అవతారం గారు. అవి అసలు కారణాలు కావనీ, అసలు కారణం వేరే ఉందనీ ఆరోజే తెలిసింది కమలకి. తల్లిదగ్గర మారాం చేసి ఏడవగా, విసిగిపోయి కేకలు వేసింది శేషమ్మ గారు.‘‘మీ అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ పదిమందికీ ఎఫ్ఫేలూ ఎమ్మేలూ చెప్పంచడానికి మీ నాన్న లక్షాధికారనుకున్నావా? ఏడుపు కట్టిపెట్టు. ఎండెక్కింది. ఆ పచ్చికర్రలు ఎండలో పడేసి పెట్టు’’ అని విసవిస వెళ్లింది వంట దగ్గరికి.అందుమీదట కళ్లు తుడిచేసుకొంది కమలబాల. అప్పణ్నించీ ఎవరూ చూడకుండా కళ్లు తుడిచేసుకోవడం అలవాటు చేసుకొంది.కోపంగా ఉండడం చేత అవతారంగారి భార్య సంతానం సంఖ్య ఎక్కువ చేసుకుందేగాని నిజంగా లేరావిడకి పదిమంది పిల్లలు. కమల పుట్టిన పదేళ్లకి కడసారిది విమల కలిగింది. ఈమధ్యకాలంలో ఉద్భవించినవాళ్లు నలుగురు. వరసగా సీతారాముడు, రాధాకృష్ణుడు, పార్వతీప్రసాదుడు, గంగాధరుడు. ‘‘ఒరే సీతా, ఒరేయ్ రాధా! ఏవర్రా గంగా, పార్వతీ! ఎంతసేపయింది ఒడ్డించీసి. ఇంకా అక్కడే కూర్చున్నారూ? ఎక్కడ దాపరించేయో ఆ మొక్కలు. మీ అక్కకి మతిపోతే మీకూ మతులు పోతున్నాయర్రా! రండి’’ ఇదీ శేషమ్మగారు వేసే కేక.కొత్త ఇంటికి రాగానే అవతారంగారి భార్య పెరట్లో ధనియాలు చల్లింది, కాకరపాదు పెట్టింది. దొండబడ్డు నాటింది. ఓరోజున కమల అటూ ఇటూ తిరిగి పరుగెత్తుకొచ్చి, ‘‘అమ్మా, ఎరువుకుప్ప దగ్గిర కొత్తిమీరి మొక్కలు ఎన్నున్నాయనుకున్నావ్’’ అంది. ‘‘అవి బంతిమొక్కలే బభ్రాజమానవా?’’ ‘‘బంతిపువ్వులు పూస్తాయా?’’ ‘‘బంతి మొక్కలకి బంతి పువ్వులు పుయ్యకపోతే పొట్లకాయలు కాస్తాయనుకున్నావుటే. చదవ్వేస్తే ఉన్న మతి కూడా పోయిందిట’’ అంది శేషమ్మగారు. ఆరోజు నుంచే కమలకి మతిమారడం జరిగింది. వెంటనే పువ్వులతోట వేసేద్దా మనుకోలేదు కమల. మసిబొగ్గుల్లో మాణిక్యం కనిపిస్తే దాన్ని వేరే తీసేసి దానికి తగిన ఏర్పాట్లు చేసినట్టుగా, ఎరువుకుప్ప నుంచి బంతి మొక్కల్ని వేరు చేయాలని కలిగిన ఆలోచన ‘‘పూలతోట’’కి దారితీసింది. తరువాత ఆ ఎరువునే మోసుకొచ్చి ఆ మొక్కలకే వేయడం జరిగిందనుకోండి. ఆ మొక్కల్ని కొన్ని తీసుకొచ్చి పెరట్లో పాతింది కమల. పాతడానికి పిసరైనా సాయం చెయ్యని పెద తమ్ముడు సీతగాడు– ‘‘అక్కయ్యా, పెరట్లో వేస్తున్నావా? ముందువేపు వేస్తే షోగ్గా ఉండదుటే’’ అని ఇంటిముందు నాటమని సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించింది కమల. ‘‘లైనుగా వేస్తే బావుంటుంది కదే’’ అన్నాడు రాధ. అలాగే చేసింది కమల. ‘‘దగ్గిరగా పాత్తే మన గదిలో సామాన్లాగా ఇరుగ్గా ఉంటుందే. దూరంగా పాద్దూ’’ అన్నాడు పార్వతి. ‘‘చాతనైతే సాయం చెయ్యి. లేకపోతే నోరుమూసు క్కూచో’’ అనేసినప్పటికీ మొక్కల్ని దూరంగానే నాటింది కమల. గంగగాడు సలహాలేవీ ఇవ్వకుండా, చిన్న చెంబులో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చేడు. విమల సలహాలూ ఇవ్వలేదు, ఊరికే కూర్చోనూ లేదు. కొన్ని నాటబోయి, కొన్ని తొక్కేసి, కమలచేత చీవాట్లు తిని, సీతచేత ఓదార్చబడి, అమ్మ దగ్గరకి తీసుకుపోబడింది. ఆఖరికి, ఆ సాయంకాలానికి అంతా కలిసి ఆరు వరసల్లో ముప్ఫై బంతిమొక్కలు నాటేరు. సాయంత్రం ముప్ఫయి కూడా సొమ్మసిల్లిపోయి తలలు వేళ్లాడేసేయి. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు లేడు. మేఘాలూ లేవు. చుక్కలున్నాయి కాని వాటివైపు చూడ్డంలేదు కమల. బుడ్డిదీపం పట్టుకొని, మొక్కల్ని బిక్కూ బిక్కూ చూసింది. మొక్కలు బతకవేమోననే బెంగచేత అవతారాన్నీ శేషమ్మనీ బతకనిచ్చింది కాదు కమల. ఆ రాత్రి తనకి ఎప్పుడు నిద్రపట్టిందో కమలకి తెలీదు. ఎక్కణ్నించో మేఘాలు వర్షించి వెళ్లిపోయాయన్న సంగతీ తెలీదు. మర్నాడు ఇంటిముందుకు వెళ్లి చూసి, కెవ్వున కేకవేసి మడిదగ్గరకి పరిగెట్టింది. తల్లికి తెలుస్తుంది; తండ్రికీ తెలుస్తుంది; భగవంతుడికి తెలిసే ఉంటుంది; ప్రాణాన్నీ జీవితాన్నీ పెంచి పోషించేవారందరికీ తెలిసితీరాలి. ఆ ఉదయం తలలెత్తి నిల్చున్న చిన్న ఎత్తు బంతిమొక్కలు ఓ పదమూడేళ్ల ఆడపిల్లకి కలిగించిన సంతోష, సంభ్రమ, ఉద్వేగాలు ఎటువంటివో ఏమిటో. ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది. అటు ఆ మొక్క దగ్గరికి పరిగెట్టింది. ఇదే కమల ఈ మొక్కా అయింది. ఇదే కమల ఆ మొక్కా అయింది. నిన్నటి రాత్రి నీటిమబ్బూ ఈ కమలే. ఆ కమలే ఈ ఉదయం సూర్యరశ్మిగా మెరుస్తోంది. ఆ ఉత్సాహమే కమలని మరోకమలగా చేసింది. మొక్కల్ని పెంచడమే పనయిపోయింది. కాని పెంచే అధికారం కమలొక్కర్తే గుత్తకి పుచ్చుకోలేదు. నీళ్లు పోస్తూండడమే గంగగాడి పని. బొరిగా తొళ్లికా తెచ్చే పని పార్వతిగాడిది. ఎరువు పొయ్యడం రాధగాడి పనుల్లో ఒకటి. రెండు పూట్లా తనిఖీ చేసే అధికారి సీతగాడు. ఆఫీసు నుంచి వచ్చేక మొక్కల దగ్గర వాలుకుర్చీ వేసుకొని న్యూస్‌పేపరు చదువుకొనేప్పుడు రాతిమీద కూర్చుని ఏదో కుడుతూ మధ్యమధ్య మొక్కల్నీ పిల్లల్నీ మెచ్చుకు గొప్పపడ్డం శేషమ్మగారి పని. ఓ రోజు పొద్దున్నే, ‘‘అక్కయ్యా! మొగ్గ మొగ్గ!’’ కేకేసేడు పార్వతి. ఓ ఘడియసేపు వెర్రెత్తినట్టుగా తిరిగింది కమలబాల.దాదాపు అన్ని మొక్కలూ మొగ్గతొడిగేయి. అందుమీదట ఏ మొక్క ముందు పూస్తుందనే ప్రశ్న వచ్చింది. మొదటి వరుసలోదా, మూడో వరుసలోదా? అని తర్జన భర్జన జరుగుతూండగానే అన్నిటిలోకీ పొట్టి మొక్కకి ఒక పువ్వు కొంత విడింది. బంగారమే అంతగా పండింది. అప్పట్లో కమలకే కాదు, పిల్లలందరికీ వెర్రులెత్తేయి. అవతారంగారు కూడా సంతోషం ప్రకటించకుండా ఉండలేకపోయారు. శేషమ్మగారు కూడా చిన్నదయింది. విమల గెంతులు వేసింది. పువ్వు బాగా విడాక ‘‘విమలా, పువ్వు ముట్టుకోకేం’’ అని కమల హెచ్చరించడంతో పువ్వులెవ్వరూ తెంపరాదనే రూలుకి పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. పూసిన ఒక్క పువ్వూ కోసేడమేనా? మరోటి కూడా బాగా విడాక కొయ్యొచ్చు అని ఆదిలో అనుకున్నారు. తరువాత ప్రతి మొక్కకి అధమం ఒక పువ్వయినా విడితేగాని తెంపరాదనుకున్నారు. చివరికి అన్నీ పూసేయి. అప్పుడు విమలని పొట్టిమొక్కదో పువ్వు తెంపుకోనిచ్చింది కమల. తనే తెంపి ఇచ్చింది. తెంపిందే కాని తెగ విచారించింది. ‘‘అక్కయ్యా! మేక తినేస్తే మొక్కలేడుస్తాయని చెప్పేవు కదా ఆ వేళా. మరి నువ్వెందుకే పువ్వు తెంపేసేవూ?’’ అని అడిగేడు గంగగాడు. ‘‘మరింకెప్పుడూ తెంపొద్దురా’’ అంది కమల పెద్ద నిశ్చయానికి వచ్చేసి. తను ఏర్పరుచుకున్న ఆ అందాన్ని చూస్తూ అక్కడ రాతిమీద కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు మరిచేది కమలబాల. దూరంలో ఉన్న స్కూలూ; మెరిసే కంచుగంటా; ప్రార్థన పాటా; తనకీ సావిత్రికీ తెలుగులో ఫస్టుమార్కుల పోటీ; ఇంగ్లీషు స్పెల్లింగ్సూ; లెక్కల స్టెప్సూ, అన్నిటి గురించీ మర్చిపోయేది. అలా ఓ రోజున మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు వచ్చేడు బక్క భగవాన్లు. ఇంటివారి వ్యవహారాలన్నీ చూసే ఉద్యోగం భగవాన్లుది. అద్దె పుచ్చుకున్నాక ‘‘ఇంటివాళ్లు క్రిస్మస్కి వస్తున్నారండోయ్’’ అని చెప్పేసి పోయేడు. ఇంటివారంటే అంత ఇష్టం లేదు కమలకి. ఇంటాయన చిన్నింటివైపుకి రాడు. ఇంటావిడ మంచిమనిషిలాగే కనిపిస్తుంది. పెద్దకూతురు అత్తవారింట్లో పొట్టతో ఉంటుంది. రెండో కూతురు పదహారేళ్లదే అయినప్పటికీ పాతికేళ్ల మనిషిలా ఉంటుంది. మూడో అమ్మాయి నెమ్మదిగానే ఉంటుంది. పదేళ్లది. ‘‘రెండు జడలమ్మాయి’’ అంటారు. నిన్న మధ్యాహ్నం కారు దిగేరు ఇంటివారు. ఉదయాన్నే లేచింది కమల. మధ్యాహ్నం ఇంటివారి నౌఖరు శేషమ్మగార్ని బిందె ఒకటి అడిగి పట్టుకెళ్లేడు. మరేం విశేషాల్లేవు. మధ్యాహ్నం మూడు గంటలకి మాత్రం– చిన్న బిందెలో నీళ్లు పట్టుకొచ్చిన కమల, బిందెని విడిచేసి పరిగెట్టింది మొక్కల దగ్గరికి. వరండాలోకి ఇంటావిడా, గుమ్మంలోకి శేషమ్మగారూ ఒక్కసారే వచ్చేరు. ఇంటివారి ఆఖరమ్మాయి, బ్లూ గౌను తొడుక్కున్నది, గాలికొట్టిన బంతిలా ఉన్నది– ‘‘నే కోసుకుంటా. నా యిష్టం’’ అని గట్టిగా అరుస్తోంది. ‘‘వీల్లేదు’’ అని కమల కేకలేస్తోంది. ఇద్దరూ పెనుగులాడుతున్నారు. మూడు బంతిపువ్వులు నలిగి నేలని పడ్డాయి. ‘‘ఏం పిల్లా! ఏవిటా అల్లరీ?’’ అని ఇంటావిడ కమల్ని మాత్రం ఉద్దేశించి అడిగింది. ఇద్దరమ్మాయిలూ పెనుగులాట ఆపేసి, నిల్చుండిపోయారు. శేషమ్మగారొచ్చి కూతురి చెయ్యి పట్టుకు నిల్చుంది. ‘‘ఆ పువ్వులే అంత మహా భాగ్యంటమ్మా? కోసుకుంటుంది మా బేబీ, దాన్నేం అనకండి’’ అని శేషమ్మగారితో చెప్పి లోనికి వెళ్లిపోయింది ఇంటావిడ. తల్లి ముఖంలోకి చూసింది కమల. బేబీని వారించడానికి శేషమ్మగారికి ధైర్యం లేదని ఆమె ముఖం చెప్తోంది. వెనక్కి తిరిగి చూడకుండా, ఇంటివైపుకి నడిచారు తల్లీకూతుళ్లు. బంతిపువ్వులే మహాభాగ్యమా? కళ్లు తుడుచుకుంది కమలబాల. రావిశాస్త్రి సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922– 93) కథ ‘పువ్వులు’ సంక్షిప్త రూపం ఇది. 1955లో ఆంధ్రపత్రికలో అచ్చయింది. సౌజన్యం: కథానిలయం. అల్పజీవి, రాజు మహిషి, రత్తాలు రాంబాబు, ఆరు సారా కథలు, రుక్కులు రావిశాస్త్రి పుస్తకాల్లో కొన్ని. -
రావిశాస్త్రిని గాంచిన వేళ
జ్ఞాపకం నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! ‘‘ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలీసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒక్కడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలీసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజరు!...’’ ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది ‘మూడుకథల బంగారం’లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం. ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా ‘ఆరుసారా కథలు’ చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం... దిమ్మ తిరిగిపోయింది. అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరువాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! విశాఖపట్నం వెళ్లాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్లడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య. ‘రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?’ ‘అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి. కుదిర్తే కాళ్లమీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!’ ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికి రాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్బీ శర్మగారి అవసానదశ. పనిలో పనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది. కొన్నాళ్లకి నా అదృష్టం ధనలక్ష్మీ లాటరీ టికెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను ‘భలే మంచిరోజు, పసందైన రోజు’ అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు(హిందూ కాలేజ్ ఆడిటోరియం) దగ్గరికి చేరుకున్నాను. అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురుచూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభా స్థలానికి చేరుకుంటున్నారు. ‘ఇంతకీ రావిశాస్త్రి రాలేదా?’ కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ. ఓ పది నిమిషాలకి - అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేమ్ కళ్లద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫొటోల ద్వారా చిరపరిచితం. ఆయనే రావిశాస్త్రి! క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురుచూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈలోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్‌నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ ‘మా చెల్లెలు నిర్మల తెలుసా?’ అనడిగారు. ‘తెలుసు. వారు నాకు ఫార్మకాలజీ పరీక్షలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సార్’ అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే! రావిశాస్త్రి పక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - ‘రాజు-మహిషి’ ఎప్పుడు పూర్తిచేస్తారు? ‘రత్తాలు రాంబాబు’ని పూర్తిచెయ్యకుండా ఎందుకు వదిలేశారు?’ వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ల సంభాషణ చికాకు కలిగించింది. ‘రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!’ నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్లు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తిని కలిగిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్య సౌందర్యానికి స్పెల్‌బౌండ్ అయిపోయి... చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు! వై.వి.రమణ yaramana.blogspot.in (వ్యాసకర్త సైకియాట్రిస్ట్). -
ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?
బంగ్లా సిరీస్ తర్వాత పూర్తి బాధ్యతలు ఏడాదికి రూ.7 కోట్లు వేతనమంటూ కథనాలు ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి నడుస్తున్న చర్చ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం డెరైక్టర్ హోదాలో బంగ్లాదేశ్‌లో ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి అన్ని రకాలుగా మద్దతు పలకడం, శాస్త్రి కూడా స్వయంగా ఆసక్తి చూపించడంతో బీసీసీఐ మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. అదే జరిగితే 2000 తర్వాత ఒక భారతీయుడు జట్టుకు కోచ్‌గా వచ్చినట్లు అవుతుంది. ఇటీవల గంగూలీ, ద్రవిడ్‌లాంటి పేర్లు వినిపించినా వారికి ఇప్పటికే ఇతర బాధ్యతలు అప్పగించడంతో సందేహాలు తీరిపోయాయి. కోచ్‌గా ఎంపికైతే రవిశాస్త్రికి ఫీజుగా బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. తద్వారా ప్రపంచ క్రికెట్లో అత్యధిక మొత్తం అందుకునే కోచ్‌గా ఈ మాజీ ఆల్‌రౌండర్ గుర్తింపు పొందుతాడు. గతంలో డంకన్ ఫ్లెచర్‌కు బోర్డు ఏడాదికి రూ. 4.2 కోట్ల చొప్పున చెల్లించింది. -
నేర్చుకుంది చాలు...ఇక గెలవడం ముఖ్యం!
♦ టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ♦ బంగ్లాదేశ్‌కు బయల్దేరిన భారత జట్టు భారత జట్టు పరాజయంపాలైన సందర్భాల్లో కెప్టెన్‌గా ధోని సాధారణంగా ఎప్పుడూ చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్చుకోగలిగాం. ఎలా ఆడామన్నది కూడా ముఖ్యం. కాబట్టి ఫలితాలకంటే దానిని సాధించే క్రమంలో ప్రక్రియకు నా దృష్టిలో ప్రాధాన్యత’ అని అతను వివరణ ఇచ్చేవాడు. కానీ ఆటలోనూ, మాటలోనూ ధోనికి భిన్నంగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా తన ఆలోచనను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. అదీ ధోని ధోరణికి పూర్తి విరుద్ధంగా! మ్యాచ్‌లో నేర్చుకోవడాన్ని తాను నమ్మనని, గెలుపే ముఖ్యమని అతను వ్యాఖ్యానించడం విశేషం. కోల్‌కతా : బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం ఢాకా బయల్దేరి వెళ్లింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ సందర్భంగా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. విశేషాలు కోహ్లి మాటల్లోనే... సన్నాహాలపై : జట్టులోని ఆటగాళ్లంతా ఉత్సాహం గా ఉన్నారు. కొంత విరామం తర్వాత దీనిని కొత్త ఆరంభంగా చెప్పవచ్చు. మన జట్టుకు సంబంధించి ఫిట్నెస్ అనేది ఎప్పుడూ సమస్యే. శనివారం ఫిట్నెస్ టెస్టులో అంతా బాగుంది. ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ క్వార్టర్స్ మ్యాచ్ ప్రభావం, ప్రతీకారం తీర్చుకోవడంలాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. అదంతా గతం. కెప్టెన్సీపై : టెస్టు కెప్టెన్‌గా నేను కూడా ఎంతో ఉద్వేగంగా ఉన్నాను. వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు కెప్టెన్సీ భిన్నం. కాబట్టి దానికి సంబంధించి నా దృష్టిలో భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. గతంలో కెప్టెన్సీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొత్త కాదు. ఆస్ట్రేలియాలో నాయకత్వం వహించినప్పుడు చాలా నేర్చుకున్నాను. టీమ్ బాగుంది కాబట్టి అదే నిలకడను కొనసాగిస్తాను. భారత జట్టు భవిష్యత్తుపై : ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదల్చుకున్నా. మనం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం. నేర్చుకోవాలనే ఆలోచనతో మ్యాచ్ బరిలోకి దిగడం, నేర్చుకుంటూనే ఉండటం సరైంది కాదు. టీవీలో చూసి కూడా నేర్చుకోవచ్చు! మనం తగినన్ని టెస్టులు ఆడాం. ఇకపై ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలి. కాబట్టి టెస్టులు గెలవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగాలి. గత కొన్ని టెస్టుల్లో చాలా నేర్చుకున్నాం. ఇకపై ఫలితాలు సాధించడమే ముఖ్యమని నా అభిప్రాయం. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణంపై : నేను ఈ టూర్లో ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోలేదు. అసలు అవి లక్ష్యాలు కావనే నేను చెబుతాను. మ్యాచ్‌ను గెలిపించలేని సెంచరీ వృథా. కాబట్టి ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే వాతావరణం నేను కల్పిస్తాను. మ్యాచ్ గెలవాలంటే ముందుగా మైండ్‌సెట్ అలాగే ఉండటం అవసరం. ఇంకా ఎక్కువ కాలం ఉంటానేమో : రవిశాస్త్రి భారత జట్టుకు ప్రస్తుతం ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారని, ఈ పరిస్థితుల్లో హెడ్ కోచ్ లేకపోవడం సమస్య కాదని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి వ్యాఖ్యానిం చారు. అవసరమైన సమయంలో తాను ఆ పాత్రలో ఒదిగిపోగలనని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ పర్యటన తర్వాత కూడా తాను కొనసాగే అవకాశం ఉందని రవి చూచాయగా చెప్పారు. ‘బంగ్లా టూర్ తర్వాత బీసీసీఐ పెద్దలతో చర్చించాల్సి ఉంది. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ సమయం జట్టుతో ఉంటానేమో. ప్రస్తుతానికి నేను దేనినీ కొట్టిపారేయడం లేదు’ అని శాస్త్రి స్పష్టం చేశారు. -
బంగ్లా పర్యటన తర్వాతే స్పష్టత
టీమ్ డెరైక్టర్ పదవిపై రవిశాస్త్రి న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుతో తన కొనసాగింపుపై పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికైతే నేను జట్టుతో పాటే ఉన్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది బోర్డుతో సమావేశమై చర్చించాక తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా దృష్టంతా బంగ్లా పర్యటన మీదే ఉంది. కోహ్లి నా గురించి మాట్లాడిన విధానం బాగుంది. విరాట్ ఏదైనా సూటిగానే మాట్లాడుతాడు. జట్టులోని ఆటగాళ్లంతా నిజాయితీగా ఉంటారు. 35 ఏళ్ల నుంచి బోర్డుతో అనుబంధం కొనసాగుతోంది. ఈ కాలంలో చాలామంది అధ్యక్షులు మారారు. నేనందరితోనూ బాగానే ఉన్నాను’ అని రవిశాస్త్రి అన్నారు. -
ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన భారత్
కోల్‌కతా : బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరంలో తొలి రోజు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో... 14 మందితో కూడిన టెస్టు బృందం తమ ఫిట్నెస్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంది. దీనికోసం సాయంత్రం 4.45 గంటలకు మైదానంలో ప్రవేశించిన ఆటగాళ్లు రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేశారు. హర్భజన్, ఇషాంత్, కోహ్లి తదితరులు 20మీ. దూరం వేగంగా రన్నింగ్ చేశారు. శనివారం తన 27వ పుట్టిన రోజు జరుపుకున్న రహానే సహచరుల మధ్య కేక్ కట్ చేశాడు. -
గుమస్తా జీవుల అనర్థ బతుకులు... అల్పజీవి
మన నవలలు: ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... సుబ్బయ్య కొంచెం పిరికివాడు. గుమస్తా కావడం వల్ల పిరికివాడయ్యాడా పిరికివాడు కావడం వల్లే గుమస్తా అయ్యాడా చెప్పలేం కాని మొత్తం మీద పిరికివాడు. భయపడతాడు. పెళ్లాన్ని అసేయ్ ఒసేయ్ అనడానికి భయపడతాడు. ఆఫీసులో తనని ఏడిపించిన హెడ్ క్లర్క్‌ని- ఏరా ఒళ్లు కొవ్వెక్కిందా అని ఎదిరించడానికి భయపడతాడు. కుదర్దు... ఇంతే ఇస్తా అని కూరగాయలవాడితో దెబ్బలాడ్డానికి భయపడతాడు. పిల్లల మీద చేయెత్తడానికి భయపడతాడు. లోకం మీద నోరెత్తడానికీ భయపడతాడు. అధికారం అంటే భయం. పోలీసులంటే భయం. కోర్టులంటే భయం. హాస్పిటల్స్ అన్నా భయమే. చక్కగా ఒక గుల్ల కావాలి సుబ్బయ్యకి. పొద్దున తొమ్మిదింటికి ఆఫీసుకు వెళ్లడం. గొడ్డులా చాకిరీ చేయడం. సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. నిద్ర పోవడం. మళ్లీ తిరిగి ఆఫీసుకు వెళ్లడం. నెల తిరిగే సరికల్లా వచ్చిన నాలుగు డబ్బుల్తో వెచ్చాలు తెచ్చుకోవడం. గుట్టుగా సంసారం నెట్టుకురావడం. చిన్న చిన్న అవస్థలు వస్తే ఇబ్బంది పడటం. పెద్ద పెద్ద అవస్థలే దాపురిస్తే గుటుక్కుమనడం. ఒక సేఫ్ రొటీన్ జీవితం. ఇది కావాలి సుబ్బయ్యకి. దీనికి భిన్నంగా ఏది జరిగినా భయపడతాడు. హడలెత్తి పోతాడు. ఆఫీసులో బిల్స్ క్లియర్ చేసే పని అతనిది. బావమరిది ఇది గమనించాడు. ఎవరి బిల్సు క్లియర్ చేయాలో వాడి దగ్గర ఐదు వందలు అడిగి తనకు ఇమ్మన్నాడు. ఇలా చేయొచ్చా? కూడదు. కాని సుబ్బయ్యకు వేరే దారి లేదు. అడుగుతున్నది బావమరిది. అడగమన్నది కట్టుకున్న భార్య. చెప్పిన పని చేయకపోతే చేతగానివాడంటారు. సుబ్బయ్య ఐదువందలు కాంట్రాక్టర్‌ని అడిగేశాడు. చేబదులు అన్నట్టుగా అడిగాడు. కాని అది లంచం. అతడు చేబదులే అన్నట్టుగా ఇచ్చాడు. కాని అది దక్షిణ. ఇచ్చిన ఐదు వందలు బావమరిదికి అందింది. కాని, ఆ వెంటనే సెక్షన్ కూడా మారిపోయింది. మరి? తను కాకుండా వేరెవరైనా తింటుంటే హెడ్ క్లర్క్ ఊరుకుంటాడా? మార్చాడు. దక్షిణ అని ముట్టజెప్పినవాడు ఇప్పుడు కాబూలీవాలా అయ్యాడు. తన బిల్స్ క్లియర్ చేయకుండా అప్పనంగా ఐదు వందలు తీసుకుంటే ఎవరు ఊరుకుంటారు? కాని ఐదు వందలు! జీతం వందో నూటేభయ్యో ఉన్నప్పుడు ఇంటి అద్దె ఐదూ పదీ రూపాయలు ఉన్నప్పుడు పావలాకి బేడకి కావలసిన వస్తువులు దొరుకుతున్నప్పుడు ఐదువందలంటే ఎంత పెద్ద మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? సుబ్బయ్య భయపడిపోయాడు. ఇచ్చిన కాంట్రాక్టర్ దుర్మార్గుడు. పుచ్చుకున్న బావమరిది అవకాశవాది. తానేమో పిరికివాడు. ఎలా... ఎలా... ఎలా. సుబ్బయ్య వెర్రెత్తిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఎక్కడికని పారిపోగలడు? ఒక ఐదు వందల మొత్తం! అతడి జీవితంలోని ప్రశాంతతను అంతా సర్వనాశనం చేసేసింది. కాదు... అతడిలోని పిరికితనమే అతణ్ణి సర్వనాశనం చేసేసింది. ధైర్యంగా ఎప్పుడైనా ఉన్నాడా తను. ధైర్యంగా దేన్నయినా ఎదిరించాడా తను. ధైర్యంగా ఇది తప్పు అని వాదించాడా తను. ధైర్యం చేసి దీనిని సరి చేయాలి అని రంగంలో దిగాడా తను? లేదే. ఫలానా డిగ్రీ చదువు అన్నారు. చదివాడు. ఫలానా గుమస్తా ఉద్యోగం చెయ్ అన్నారు. చేస్తున్నాడు. ఉద్యోగం కోసం చదువు. చదివేదంతా ఉద్యోగం కోసమే. కాళ్లు తీసేసి కుర్చీలో కూచోబెట్టడం ఇది. జీవితాంతం పరాన్నభుక్కును చేసేయడం. ఉద్యోగం పోతే ఇంతే సంగతులు. గుమస్తా కాకపోతే ఇంతే సంగతులు. ఈ భయం.... భయం... భయం... నరాల్లోకి ఎక్కడిదాకా పాకిందంటే ఆఖరుకు నచ్చిన ఆడది పిలిస్తే భయపడ్తూ భయపడ్తూ వెళ్లి ఎవరైనా చూస్తారేమోనని భీతిల్లి తీరా ఆమె చేరువ అయితే బిక్కముఖం వేసి నీరుగారిపోయి.... మగాడిగా బతకడం అంటే స్త్రీ దగ్గర మగతనం ప్రదర్శించడం కాదు. అన్ని సందర్భాల్లోనూ మగాడిగా బతకడమే. సుబ్బయ్య గుమస్తా బతుకు అతణ్ణుంచి ఆ మగతనాన్ని హరించేసింది. ఇక మిగిలిందల్లా పిరికి పిప్పి. అతడేనా? దేశమంతా ఈ పిరికి పిప్పే. పెద్ద గుమాస్తాలు... చిన్న గుమస్తాలు.... కార్లూ టైలూ ఉన్న బడా గుమస్తాలు.... టెన్ టు ఫైవ్ బందీలు.... నోరెత్తకుండా పని చేసుకుపోయే కూలీలు... నవల: అల్పజీవి; రచన: రాచకొండ విశ్వనాథ శాస్త్రి తొలి ముద్రణ: 1955; రావిశాస్త్రికి విశేషమైన పేరు తెచ్చిన ఆయన తొలి నవల. జేమ్స్ జాయిస్, శ్రీశ్రీ ‘కోనేటి రావు’ పాత్రల ప్రభావంతో తాను ఈ నవల రాశానని రావిశాస్త్రి చెప్పుకున్నారు. రచనలో విశేషమైన వేగం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల కూడా దీనికి ఆదరణ లభించింది. కథ కంటే కథనమే ముఖ్యం. రాజు- మహిషి, రత్తాలు - రాంబాబు... ఆయన ఇతర నవలలు. మనసు ఫౌండేషన్ ప్రచురించిన రావి శాస్త్రి రచనలులో ఈ నవల లభ్యం. ఆ ప్రతులు దొరకని వారు జిరాక్స్ కాపీ కోసం పుస్తకాభిమాని అనిల్ బత్తులను సంప్రదించవచ్చు. ఆయన నం.9059134111 అందుకే ఒక పది మందో ఇరవై మందో కలసి ఆట ఆడిస్తుంటారు. ఓట్లు వేయకపోయావో చస్తావ్ అంటారు. చెప్పినట్టు వినకపోయావో చంపుతాన్ అంటారు. రెంటు పెంచినా, కరెంటు పెంచినా, సిలిండర్ పెంచినా, పార్కింగ్ ఫీజు పెంచినా, సినిమాహాళ్లలో నోటికొచ్చిన రేటును పెంచినా, ప్లాట్ పెంచినా, ఫ్లాట్ పెంచినా నోర్మూసుకొని ఉండాలి. రైళ్లు లేవు ఫో అంటే సణుక్కుంటూ పోవాలి. బస్సులు చంపితే ఛావ్ అంటే జీ హుజూర్ అనుకుంటూ చావాలి. అందరూ అంతే. భరించడం తప్ప మార్చడం తెలియనివారు. మార్చాలంటే లంపటంలో దిగాలి. లంపటంలో దిగితే అమ్మో.... అవతల ఆఫీసుకు వెళ్లాలి.... గుమస్తాలు! సుబ్బయ్య కూడా అలాంటి గుమాస్తానే. ఒరే కాంట్రాక్టర్ వెధవా... నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వనురా అని చెప్పడం చేతగాని గుమాస్తా. చచ్చు మనిషి. చచ్చిన మనిషి. అయితే అప్పుడప్పుడు కొంత వెలుతురు వస్తుంది. కొంత మార్చ ప్రయత్నిస్తుంది. సుబ్బయ్య జీవితంలో కూడా అలాంటి వెలుతురు వచ్చింది. ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆమె అతణ్ణి ఆదరించింది. ఊరడించింది. పవిటతో నుదుటి చెమట తుడిచి కొంచెం ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పింది. కాని ధైర్యంగా ఉండటానికి సుబ్బయ్యకు ధైర్యం కావాల్సి వచ్చింది. అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. అతడే కాదు దేశంలోని గుమస్తాలందరూ ఆ ధైర్యాన్ని ఇంకా అందుకోవలసి ఉంది. రావిశాస్త్రి 1953లో రాసిన నవల ‘అల్పజీవి’. పిరికితనంతో బతుకులీడ్చే మధ్యతరగతి వర్గం మీద, గుమస్తా మనస్తత్వాలతో కునారిల్లుతున్న మధ్యతరగతిలోని ప్రధాన వర్గం మీద ఆయన కొట్టిన కొరడా దెబ్బ ఇది. ఆయన బాధ ఏమిటంటే చదువుకోని వారు ఎలాగూ చస్తున్నారు. బాగా చదువుకున్నవారు లొసుగులు లోపాలను ఉపయోగించి ఎక్కడికో చేరుతున్నారు. కాని ఈ గుమస్తాలే- ఈ అపసవ్యతను తొలగించాల్సిన బాధ్యత ఉన్న ఈ గుమస్తాలే ఆ బాధ్యత నుంచి దూరంగా తొలగిపోతున్నారు. మనిషి పిరికితనం దాటాలని రావిశాస్త్రి కోరిక. ధైర్యలక్ష్మి ఉంటేనే తక్కిన లక్ష్ములన్నీ ఉంటాయని ఆయన ఈ నవలలో చెప్పదల్చుకున్నారు. లక్ష్ములు కావలసింది వ్యక్తిగతానికి కాదు. సమాజానికి. దేశానికి. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని గురజాడ అనింది అందుకే. చెహోవ్ వంటి మహా రచయిత ‘గుమస్తా మరణం’ వంటి కథలు రాసిందీ అందుకే. పిరికిగుణం ఉన్న సమాజం పైకి రాదు. పిరికి గుణం వల్లే మధ్యతరగతి పైకి రావడం లేదు. ఈ మాటను పదే పదే చెప్పడానికి ఇష్టపడ్డారు రావిశాస్త్రి. అందుకే ‘అల్పజీవి’ రాసినా అదేకథాంశాన్ని ‘వర్షం’ కథలో రిపీట్ చేశారు. చలిచీమలే కాదు గుమస్తాలు కూడా మహా సర్పాలను చంపగలవు అని ఆమ్ ఆద్మీ వంటి ఉదంతాలు ఒకటీ అరా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి. అన్నివైపులా రాబందులను తరిమే పావురాల గుంపులు కమ్ముకోవాలి. అప్పుడే ‘అల్పజీవి’కి ధన్యత. రావి శాస్త్రి రచనకు సార్థకత.