ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?
బంగ్లా సిరీస్ తర్వాత పూర్తి బాధ్యతలు ఏడాదికి రూ.7 కోట్లు వేతనమంటూ కథనాలు
ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి నడుస్తున్న చర్చ దాదాపుగా ముగిసినట్లే. ప్రస్తుతం డెరైక్టర్ హోదాలో బంగ్లాదేశ్‌లో ఉన్న రవిశాస్త్రి ఆ తర్వాత పూర్తి స్థాయిలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి అన్ని రకాలుగా మద్దతు పలకడం, శాస్త్రి కూడా స్వయంగా ఆసక్తి చూపించడంతో బీసీసీఐ మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. అదే జరిగితే 2000 తర్వాత ఒక భారతీయుడు జట్టుకు కోచ్‌గా వచ్చినట్లు అవుతుంది.
ఇటీవల గంగూలీ, ద్రవిడ్‌లాంటి పేర్లు వినిపించినా వారికి ఇప్పటికే ఇతర బాధ్యతలు అప్పగించడంతో సందేహాలు తీరిపోయాయి. కోచ్‌గా ఎంపికైతే రవిశాస్త్రికి ఫీజుగా బోర్డు ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మొత్తం అందుకునే కోచ్‌గా ఈ మాజీ ఆల్‌రౌండర్ గుర్తింపు పొందుతాడు. గతంలో డంకన్ ఫ్లెచర్‌కు బోర్డు ఏడాదికి రూ. 4.2 కోట్ల చొప్పున చెల్లించింది.