ఏడాది పాటు వరుస సిరీస్‌లు
ముంబై : బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల తర్వాత భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది మొత్తం బాగా బిజీగా ఉండబోతోంది. భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ) ప్రకారం టీమిండియా విరామం లేని విధంగా సిరీస్‌లు, టోర్నీలలో పాల్గొననుంది. వచ్చే టి20 ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో దానికి సన్నాహకంగా భారత్ వచ్చే పది నెలల కాలంలో 11 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 10న ప్రారంభమయ్యే బంగ్లా పర్యటన 24న ముగుస్తుంది. ఆ తర్వాత భారత్ ఆడే వేర్వేరు సిరీస్‌ల జాబితా చూస్తే...
జులై: జింబాబ్వేలో భారత్ (3 వన్డేలు, 2 టి20లు)
ఆగస్టు: శ్రీలంకలో పర్యటన (భారత్ - 3 టెస్టులు)
సెప్టెంబర్- నవంబర్: భారత్‌లో దక్షిణాఫ్రికా (4 టెస్టులు, 5 వన్డేలు, 3 టి20)
డిసెంబర్: పాకిస్తాన్‌తో సిరీస్ (కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది)
2016 జనవరి: ఆస్ట్రేలియాలో భారత్ (5 వన్డేలు, 3 టి20లు)
ఫిబ్రవరి: భారత్‌లో శ్రీలంక (3 టి20లు)
ఫిబ్రవరి: ఆసియా కప్ టి20 (వేదిక ఖరారు కాలేదు)
మార్చి-ఏప్రిల్: టి20 ప్రపంచ కప్ (భారత్‌లో)
భారత్ బాగా బిజీ...
Published Thu, May 21 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement
Advertisement