
కోల్‌కతా: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు... ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.
గాయం కారణంగా ఏడాదికి పైగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. మూడు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, శుబ్‌మన్ గిల్, హార్దిక్‌పాండ్యా, హర్షిత్ రాణా, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తదితరులు ప్రాక్టీస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment