T20 world cup tournment
-
టీమిండియాకు పాకిస్తాన్ అల్టిమేటం
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం రోజున సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్‌లో జరగనుంది. -
భారత్ బాగా బిజీ...
ఏడాది పాటు వరుస సిరీస్‌లు ముంబై : బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల తర్వాత భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది మొత్తం బాగా బిజీగా ఉండబోతోంది. భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ప్రకారం టీమిండియా విరామం లేని విధంగా సిరీస్‌లు, టోర్నీలలో పాల్గొననుంది. వచ్చే టి20 ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో దానికి సన్నాహకంగా భారత్ వచ్చే పది నెలల కాలంలో 11 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 10న ప్రారంభమయ్యే బంగ్లా పర్యటన 24న ముగుస్తుంది. ఆ తర్వాత భారత్ ఆడే వేర్వేరు సిరీస్‌ల జాబితా చూస్తే... జులై: జింబాబ్వేలో భారత్ (3 వన్డేలు, 2 టి20లు) ఆగస్టు: శ్రీలంకలో పర్యటన (భారత్ - 3 టెస్టులు) సెప్టెంబర్- నవంబర్: భారత్‌లో దక్షిణాఫ్రికా (4 టెస్టులు, 5 వన్డేలు, 3 టి20) డిసెంబర్: పాకిస్తాన్‌తో సిరీస్ (కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది) 2016 జనవరి: ఆస్ట్రేలియాలో భారత్ (5 వన్డేలు, 3 టి20లు) ఫిబ్రవరి: భారత్‌లో శ్రీలంక (3 టి20లు) ఫిబ్రవరి: ఆసియా కప్ టి20 (వేదిక ఖరారు కాలేదు) మార్చి-ఏప్రిల్: టి20 ప్రపంచ కప్ (భారత్‌లో) -
ధోనికి పురస్కారం
లండన్: టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్‌కు చేరిన ఆనందంలో ఉన్న ధోని... ప్రతిష్టాత్మక అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ‘క్రీడారంగంలో అద్వితీయ ప్రదర్శన’కు గాను ధోనిని 2014 ఆసియా అవార్డు వరించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి ఈ అవార్డులను ప్రకటించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ధోని.. శుక్రవారం ఇక్కడ జరిగిన అవార్డు కార్యక్రమానికి రాలేకపోయినా తన సందేశాన్ని పంపించాడు. ఆసియాతోపాటు ప్రపంచమంతా ఉన్న తన అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలిపాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని అత్యంత గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతని నాయకత్వంలో భారత జట్టు రెండు ఫార్మాట్లలో ప్రపంచకప్‌లతో పాటు ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను దక్కించుకుంది’ అని అవార్డు ఫలకంపై పేర్కొన్నారు.