లండన్: టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్స్‌కు చేరిన ఆనందంలో ఉన్న ధోని... ప్రతిష్టాత్మక అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ‘క్రీడారంగంలో అద్వితీయ ప్రదర్శన’కు గాను ధోనిని 2014 ఆసియా అవార్డు వరించింది.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి ఈ అవార్డులను ప్రకటించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ధోని.. శుక్రవారం ఇక్కడ జరిగిన అవార్డు కార్యక్రమానికి రాలేకపోయినా తన సందేశాన్ని పంపించాడు. ఆసియాతోపాటు ప్రపంచమంతా ఉన్న తన అభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు తెలిపాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని అత్యంత గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతని నాయకత్వంలో భారత జట్టు రెండు ఫార్మాట్లలో ప్రపంచకప్‌లతో పాటు ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను దక్కించుకుంది’ అని అవార్డు ఫలకంపై పేర్కొన్నారు.
ధోనికి పురస్కారం
Published Sun, Apr 6 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
Advertisement
Advertisement