లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం రోజున సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని ప్రకటించారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు.
ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్‌లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్‌లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే టీ20 వరల్డ్ కప్ 2021 భారత్‌లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment