
బంగ్లా సిరీస్ కి రాహుల్ దూరం
కోల్కతా: బంగ్లాదేశ్ పర్యటనకు భారత టెస్టు ఆటగాడు కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. భారత్ ఈ నెల 10-14 తేదీల మధ్య బంగ్లాతో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. అయితే డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఈ కర్ణాటక బ్యాట్స్మన్ కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండటంలేదని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. రాహుల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరగానే కోలుకుంటున్నాడని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాహుల్, సిడ్నీలో జరిగిన రెండో మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ సారధ్యంలోని టెస్టు జట్టు సోమవారం ఢాకా వెళ్లనుందని ఠాకూర్ తెలిపాడు. జూన్ 10 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్, జూన్ 18న మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.